సబ్ ఎడిటర్లు బలిపశువులయ్యారు..

కనిపించని నాలుగో సింహం పోలీస్ అన్నారు. అలాగే జర్నలిజంలో కనిపించని కార్యదీక్షపరులు సబ్ ఎడిటర్లే.. తెరవెనుక చెత్త వార్తలు కూడా తెల్లవారి బాంబులుగా పేల్చేసేది వారే.. కానీ ఈ విషయం జనానికి తెలియదు.. అందుకే బయట ఉన్న వ్యక్తులనే హీరోలనుకుంటున్నారు. కానీ కష్టం ఒకరిది.. సుఖం మరొకరది అవుతోంది..

సమైక్య రాష్ట్రంలో ఎలాగు మన అధిపత్యం లేదు.. మన పనులు కాలేదు.. ఇప్పుడు అంతా మనోళ్లదే అధికారం.. కొత్త రాష్ట్రంలో ఎలాగైనా మన హక్కులు నెరవేరుతాయని ఆశించారు సబ్ ఎడిటర్లు.. కానీ రాజకీయాల్లో సబ్ ఎడిటర్లకు అన్యాయం జరుగుతోంది. వారి నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం నిరంతరంగా జరుగుతోంది..
మొన్న హెల్త్ కార్డులు, నేడు అక్రిడిటేషన్ కార్డుల్లో సబ్ ఎడిటర్లకు తీరని అన్యాయం జరుగుతోంది.. హెల్త్ కార్డులు ఎన్నో వాయిదాలు, సమాలోచనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ విషయంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు సీఎం ను కలిసి హెల్త్ కార్డులు ఇప్పించారు. ఇందులో బడా జర్నలిస్టులకు , చోటా జర్నలిస్టులకు ఆఖరుకు డెస్క్ లోని ఎడిషన్ ఇన్ చార్జులకు సైతం హెల్త్ కార్డులు వచ్చాయి. కానీ సబ్ ఎడిటర్లకు హెల్త్ కార్డులు ఇప్పటికీ రాలేదు. కడుపునిండిన జర్నలిస్టులు ఈ విషయాన్ని మరిచిపోయారు. ఇప్పుడు దాని టాపికే తీయడం లేదు.. దీంతో సబ్ ఎడిటర్లకు అన్యాయం జరిగింది..

అల్లం నారాయణకు సోషల్ మీడియాలో పెట్టిన విజ్ఞాపన ఇదీ

అల్లం నారాయణకు సోషల్ మీడియాలో పెట్టిన విజ్ఞాపన ఇదీ

అక్రిడిటేషన్లలోనూ అదే అన్యాయం..
ఈ నెల 11లోపు అక్రిడిటేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. అదే అందరి జర్నలిస్టులకు ఆఖరి గడువు. కానీ సీనియర్ , జూనియర్ జర్నలిస్టులందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు ఒక్క సబ్ ఎడిటర్లు తప్ప.. సబ్ ఎడిటర్లకు దరఖాస్తు చేసుకునేందుకు విధివిధానాలు రాలేదు.. దీంతో అటు దరఖాస్తు చేయలేక.. ఇటు ఎవరిని అడగాలో తెలియక మరోసారి సబ్ ఎడిటర్లు అన్యాయం అయిపోతున్నారు..

జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన కమిటీలో సాక్షి ఎటిటోరియల్ డైరెక్టర్ రామకృష్ణారావు, మాజీ ఎడిటర్ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలు సభ్యులు.. వీళ్లు డెస్క్ నుంచే వచ్చారు. అయినా కూడా ఇప్పటికీ సబ్ ఎడిటర్లకు హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు అందకపోవడం దారుణం.. పెద్దదిక్కు అనుకున్న వాల్లే పట్టించుకోకపోవడంతో ఇక సబ్ ఎడిటర్లకు దిక్కెవరు అని వారు ప్రశ్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *