సబ్ఎడిటర్లకు, విలేకరులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి..

HealthCard copy

సబ్ఎడిటర్లకు, గ్రామీణ విలేకరులందరికీ అక్రిడిటేషన్లు లేక మంజూరు కాని హెల్త్ కార్డులు..
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే తెలంగాణ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వడం హర్షనీయమని.. కానీ ఇందులో అక్రిడిటేషన్లు లేని జర్నలిస్టులకు , సబ్ ఎడిటర్లకు మంజూరు కాలేదని తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (Tomja) రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణలోని వివిధ పత్రికలు, చానాళ్లు, ఆన్ లైన్ వెబ్ మీడియాలో, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న చాలా మంది జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, మీడియా మిత్రులకు అక్రిడిటేషన్లు మంజూరు కాలేదన్నారు. దీనివల్ల వారికి హెల్త్ కార్డులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రిడిటేషన్లు ఉన్నవారికే హెల్త్ కార్డులు ఇచ్చిందని దీనివల్ల సబ్ ఎడిటర్లకు, రూరల్ రిపోర్టర్లకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో చాలామంది జర్నలిస్టులు మృత్యువాత పడ్డారని.. అందుకే కనీసం సబ్ ఎడిటర్లందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. అక్రిడిటేషన్లతో పాటు వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డుల సౌకర్యం కల్పించాలని కోరారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *