సబర్మతి రివర్ డెవెలప్మెంట్ ప్రంట్ ను సందర్శించిన మంత్రి కేటిఆర్ బృందం

 సబర్మతి అశ్రమాన్ని సందర్శించిన మంత్రి కెటి రామావు
 గాందీ మహాత్ముడి జీవన విధానం అందరికి అదర్శమన్న మంత్రి
 మహాత్ముడు చూపిన బాటలోనే గ్రామాల అభివృద్దికి ప్రయత్నాలు చేస్తున్నామన్న మంత్రి
 తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రాథమిక లక్ష్యం గ్రామ స్వరాజ్య స్థాపనే
 సబర్మతి నది అభివృద్ది నమూనాను అధ్యయనం
 టెక్స్ టైల్స్ ఇండియా 2017 స్టేట్ సెషన్ ను లో మంత్రి కెటి రామారావు ప్రేజంటేషన్
 టెక్స్ టైల్ పెట్టుడుల కోసం దేశంలోని ఏ రాష్ర్ర్టం ఇవ్వలేని ప్రొత్సహాకాలు తాము ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం
 సమర్ధవంతమైన నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో బలోపేతం అవుతుందన్న కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ
 తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రికి టెక్స్ రంగంపైన పూర్తి అవగాణ ఉందన్న కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ

టెక్స్ టైల్స్ ఇండియా 2017 సమావేశాలకోసం గుజరాత్ లో ఉన్న మంత్రి కెటి రామారావు రెండోరోజు బిజి బిజీగా గడిపారు. శనివారం ఉదయం జాతిపిత మహాత్మ గాంధీ జీవించిన సబర్మతి అశ్రమాన్ని మంత్రి కెటి రామావు సందర్శించారు. సబర్మతి అశ్రమ ట్రస్టీలు స్వయంగా మంత్రి వెంట ఉండి అశ్రమం గురించి వివరించారు. అశ్రమంలో సూమారు గంటసేపు పర్యటించిన మంత్రి, అక్కడి మహాత్ముడి ఇల్లు, అశ్రమంలోని పాఠశాలను సందర్శించారు. అక్కడ అయన ఉపయోగించిన వస్తువులను, లేఖలను పరిశీలించారు. అశ్రమానికి వచ్చిన మంత్రికి అక్కడి విద్యార్దులు ఒక చరఖాను బహుకరించారు. గాందీ మహాత్ముడి జీవన విధానం అందరికి అదర్శమన్న మంత్రి, అశ్రమ సందర్శణ ఒక అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అయన అశ్రమాన్ని సందర్శణ ద్వారా మహాత్ముడు గడిపిన అతి సాధారణ జీవితం అర్థం అవుతుందని మంత్రి తెలిపారు. మహాత్ముడు చూపిన బాటలోనే గ్రామాల అభివృద్దికి ప్రయత్నాలు చేస్తున్నమన్న మంత్రి, తెలంగాణ ప్రభుత్వ పథకాల ప్రాథమిక లక్ష్యం గ్రామ స్వరాజ్య స్థాపనే అన్నారు.
సబర్మతి రివర్ డెవెలప్మెంట్ ప్రంట్ ను సందర్శించిన మంత్రి కెటి రామారావు బృందం
అహ్మమదాబాద్ లోని సబర్మతి నదిని అభివృద్ది పరచడం ద్వారా ఎర్పాటు చేసిన సబర్మతి రివర్ డెవెలప్మెంట్ ప్రంట్‌ను మంత్రి కెటిరామారావు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖకార్యదర్శి నవీన్ మిట్టల్, GHMC,HMDA కమీషనర్లు, HMWSSB యండి ఇతర అధికారులు సందర్శించారు. మూసీ అభివృద్ది, సుందరీకణ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్న నేపథ్యంలో సబర్మతి నది అభివృద్ది నమూనాను అధ్యయనం చేశారు. ఇందుకోసం రివర్ ప్రంట్ అధికారులు మంత్రి బృందానికి వివరాలు అందజేశారు. సుందరీకణ కోసం ఏదురైన సమస్యలు, నదీ ఒడ్డున అప్పటి దాకా ఉన్న జనావాసాలు తరలింపు, మెత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ విజన్, ప్రజల సహాకారంతోనే ఈ ప్రాజెక్టు విజయం సాధించిందని తెలిపారు. ఈ రివర్ ప్రంట్ అహ్మదాబాద్ పట్టణానానికి ఒక తలమానీకంగా నిలిచిందని, ఇదే స్థాయిలో మూసినదిని అభివృద్ది చేస్తామని, ఈ దిశగా ఇప్పటికే నిధుల సమీకరణ, తొలి దశ ప్రణాళికలు సిద్దం అవుతున్నాయని మంత్రి తెలిపారు. సబర్మతి నది ఒడ్డున ఏర్పాటు చేసిన గార్డెన్స్, వాక్స్ వేలు, పార్కులు, రోడ్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్శన అనుభవం ఖచ్చితంగా మూసి నదీ సుందరీకరణకు ఉపయోగపడుతుందన్నారు.
టెక్స్ టైల్స్ ఇండియా 2017 స్టేట్ సెషన్ ను లో మంత్రి కెటి రామారావు ప్రేజంటేషన్
టెక్స్ టైల్స్ ఇండియా 2017 సదస్సులో కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ మంత్రి స్మ్రితి ఇరానీ పాల్గోన్న తెలంగాణ రాష్ర్ట షెషన్ మంత్రి కెటి రామారావు ప్రజేంటేషన్ ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ పాలసీలను వివరించిన మంత్రి, వరంగల్ టెక్స్ టైల్ పార్కు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. టెక్స్ టైల్ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ఒకవైపు టెక్స్ టైల్ రంగానికి ప్రాధాన్యత ఇస్తునే చేనేతను అదుకుంటున్నామని తెలిపారు. టెక్స్ టైల్ పెట్టుడుల కోసం దేశంలోని ఏ రాష్ర్ర్టం ఇవ్వలేని ప్రొత్సహాకాలు తాము ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఈ స్టేట్ సెషన్ కు వివిధ పారిశ్రామిక వేత్తలు హజరయ్యారు. ఈ సెషన్ లో ప్రసంగించిన కేంద్ర మంత్రి, తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రికి టెక్స్ రంగంపైన పూర్తి అవగాణ ఉన్నదన్నారు. రాష్ర్టం చేస్తున్న కార్యక్రమాల వలన మరింత ముందుకు పొతుందని, టెక్స్ టైల్ రంగంలో పెట్టుబడులు వస్తాయని తెలిపారు. సమర్ధవంతమైన నాయకత్వంలో నడుస్తున్న తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో బలోపేతం అవుతుందని కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ తెలిపారు. గత రెండు రోజుల నుంచి దేశ విదేశాల సియివోలకు తెలంగాణ గురించి మంత్రి బాగా పరిచయం చేస్తున్నారని కేంద్ర మంత్రి కితాబిచ్చారు. ఈ రోజు మినిష్టర్ ప్రజేంటేషన్ భాగ ఇచ్చారని, టియస్ ఐపాస్, అందుబాటులో ఉన్న వనరులు, అనుమతులపైన మంత్రి వివరించిన తీరు అద్బుతంగా ఉందన్నారు. ప్రగతి శీల తెలంగాణ రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టాలని కేంద్ర మంత్రి పెట్టుబడి దారులను కోరారు.

KTR3

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *