సన్యాసితో ‘సహవాసం’

aa srini

ముక్కు మీద కోపం.. కేసీఆర్ కే అందం..  ఈ మధ్య బహిరంగ సభల్లో కేసీఆర్ వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది.. ఏ మీటింగ్ కు వెళ్లినా ఆయన ఎవరి మీద ఒకరి మీద నోరు పారేసుకుంటున్నాడు.  ఉద్యమంలో కలిసి వచ్చిన ఉద్యమకారులను కూడా సన్నాసులుగా చూస్తూ తిడుతున్నారాయన.. ఉద్యమంలో జై కొట్టిన చేతులతో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నారాయన..  అందుకే హుస్నాబాద్ లో ప్రశ్నించిన రైతును పిచ్చొడని.. ముస్సు మహేందర్ రెడ్డిని తెలంగాణలో హీరోను చేశాడు.. ఆదిలాబాద్ గూడెంలో ప్రాణహిత ప్రేమికుడు నైనాల గోవర్ధన్ ను తిట్టి పేరు కూడా తెలియని తెలంగాణ జనానికి ఆయనను పరిచయం చేశాడు..

అసలు సీఎం చర్యలే వారి పాపులారిటీకి కారణం.. ఆయన అశాంతే ప్రభుత్వ వ్యతిరేకత కారణం.. ఈ నేపథ్యంలోనే గోటితో పోయే దానికి గొడ్డలి దాకా తెచ్చుకుంటున్నారు. పరమ ఉద్యమకారుడు కాస్తా.. కోపిస్టి హిట్లర్ లా కనపడుతున్నాడు..

ఈ మధ్య వరంగల్, ఖమ్మం జిల్లాల పర్యటన కేసీఆర్ కి జ్వరం వచ్చి రద్దయ్యిందని అందరూ అనుకుంటున్నా.. ఆ లోగుట్టు వేరే ఉందట.. ఖమ్మంలో సమస్యలపై ఉద్యమించడానికి పలువురు సంఘాలు నాయకులు సిద్ధం అయ్యారట.. ఆ విషయం తెలిసి అంతగా నాయకులు, కార్యకర్తల బలం లేని ఖమ్మం పర్యటనకు వెళ్లి వివాదాలను కొనితెచ్చుకోవడం ఎందుకనే సీఎం ఖమ్మం టూరు క్యాన్సల్ చేసుకున్నాడట..

ఇంతకీ ఈ మధ్య చిన్నజీయర్ స్వామితో సహవాసం తో కేసీఆర్ లో చాలా మార్పు వచ్చిందని ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే. శ్రీనివాస్ తన సంపాదకత్వంలో విమర్శించారు. సన్యాసిని మొక్కుతూ తెలంగాణ జనాన్ని సన్యాసలంటున్న కేసీఆర్ కు స్వామి కోపాగ్నికి గురికాడా . ? అని ప్రశ్నించాడు. పనిలో పనిగా సన్నాసులారా అని తిడితే చిన్నజీయర్  ఏమనుకుంటున్నాడో అని ఆయన ప్రశ్నించాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *