సన్నీతో నటించనన్న రానా..

హైదరాబాద్, ప్రతినిధి : సెక్సీ తార సన్నిలియోన్ తో నటించనని తెగేసి చెప్పాడట టాలీవుడ్ హీరో రానా.. ఇప్పటికే   టాలీవుడ్ లో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ సినిమాలు చూస్తూ యమ బిజీగా ఉన్న ‘రానా’ కాస్తా రిలీఫ్ అయ్యాడు. ఈ తరుణంలో ఓ బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పటికే ‘దమ్ మారో దమ్’, ‘డిపార్ట్ మెంట్’ చిత్రాలతో రానా బాలీవుడ్ ఓ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘రానా’ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ సినిమాకు ఒప్పుకున్న తరువాత చివరి నిమిషంలో తాను నటించలేనని రానా చెప్పాడంట.

జాస్మిన్ డిసౌజా దర్శకత్వంలో ‘వన్ నైట్ స్టాండ్’ పేరుతో ఓ రోమాంటిక్ చిత్రం తెరకెక్కుతోంది. కథానుగుణంగా ‘సన్ని లియోన్’ ఈ చిత్రంలో నటిస్తోంది. ఈసినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది. రానాకు సంబంధించిన షెడ్యూల్ ను షూటింగ్ చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో తాను ఈ సినిమా చేయడం లేదని చిత్ర యూనిట్ కు రానా క్లారిటీ ఇచ్చాడని టాక్.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.