
హైదరాబాద్ : అల్లు అర్జున్ హీరోగా త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’మూవీ రెండో టీజర్ విడుదలైంది. పాట నేపథ్యంలో టీజర్ కొనసాగుతోంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, సమంత, ప్రభు, ఆదా శర్మ, నిత్య మీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రావు రమేశ్, వెన్నెల కిషోర్ లు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.