
- హైదరాబాద్, జనవరి 18 : సదరన్ ఇండియా-2018 సైన్స్ ఫెయిర్
ముగింపు ఉత్సవాలలో ప్రతిభావంతులైన విద్యార్థులను గవర్నర్
నరసింహ్మన్, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం
శ్రీహరి, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డి, మల్కాజిగిరి
ఎంపీ మల్లారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సాయన్నలు కలిసి నగదు
అవార్డులు, మెరిట్ సర్టిఫికేట్లు ఇచ్చి సత్కరించారు. సదరన్
సైన్స్ ఫెయిర్ లో విద్యార్థులు రూపొందించిన సైన్స్
ఎగ్జిబిషన్లను గవర్నర్ నరసింహ్మన్, ఉప ముఖ్యమంత్రి కడియం
శ్రీహరి పరిశీలించి, విద్యార్థులను వారు తయారు చేసిన
ఎగ్జిబిట్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. వారిలో ఇప్పటి నుంచే
ఆవిష్కరణలు చేయాలన్న ఆలోచనను చూసి అభినందించారు. భవిష్యత్
లో ప్రపంచం గర్వించే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని
ప్రోత్సహించారు. ఈ ఐదు రోజుల సైన్స్ ఫెయిర్ లో
విద్యార్థులకోసం ఎలాంటి ఏర్పాట్లు చేశాం, ఉప ముఖ్యమంత్రి
కడియం శ్రీహరి సూచించినట్లు హైదరాబాద్ లో వారికి ఏయే
ప్రదేశాలు చూపించామో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య వివరించారు. ఈ రోజు పిఎస్ఎల్
వి ద్వారా శ్రీహరి కోట నుంచి వంద ఉప గ్రహాలను ఒకేసారి కక్షలోకి
విజయవంతంగా ప్రవేశపెట్టిన తీరును విద్యార్థులకు
ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని టీవీల ద్వారా ఏర్పాటు
చేసినట్లు తెలిపారు. ఈ సైన్స్ ఫెయిర్ సందర్భంగా వివిధ
రంగాల్లో నిష్ణాతులైన శాస్త్రవేత్తలను పిలిపించి
విద్యార్థులకు వారితో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయించామన్నారు.
విద్యార్థులు తమకున్న సందేహాలను శాస్త్రవేత్తలను అడిగి
తెలుసుకున్నారన్నారు. సమావేశంలో గవర్నర్ నరసింహ్మన్, ఉప
ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడారు.గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ్మన్ కామెంట్స్
భారతదేశ భవిష్యత్ మీరే…ఇక్కడి విద్యార్థుల ప్రతిభను
చూసి గర్విస్తున్నాను
మీ మేథస్సును మీ పరిసరాల్లోనే పైలట్ ప్రాజెక్టు
రూపంలో చేయండి
టి.హబ్ మీలాంటి ప్రతిభావంతులకు వేదికగా ఉంది…మీరూ మంచి
ఐడియాలతో టి.హబ్ కు రండి
భారతదేశం శాస్త్ర, సాంకేతిక పరిజ్ణానాలకు పుట్టినిల్లు..
మీ చుట్టూ ఉన్న సమస్యలను సైన్స్ ద్వారా మీరే
పరిష్కరించాలి
కంప్యూటర్లకు బానిసలు కావద్దు..మీ మేథస్సుకు పదును
పెట్టాలి
పాఠశాలలకు వెళ్లడం మానొద్దు..విద్యను కొనసాగించాలి
విద్య ద్వారానే సంపూర్ణత్వం సాధించగలం..
గొప్ప ఆవిష్కరణలు చేయడానికి భారతదేశంలో అన్ని
వసతులున్నాయి
ఉపాధ్యాయులు పిల్లల్లో ప్రశ్నించి
నేర్చుకునేతత్వాన్ని పెంపొందాంచాలి
ప్రతి విద్యార్థి వారి చుట్టూ ఉన్నవారికి రోల్ మోడల్
కావాలి
భారతీయులుగా ఉన్నందుకు గర్వించండి…పెద్దలను గౌరవించండి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు విద్య పట్ల చాలా
శ్రద్ధ వహించి ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం
చేస్తున్నారు.
తెలంగాణలో నాణ్యమైన విద్య అందుతోంది
కడియం శ్రీహరి కామెంట్స్….
పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ మీకు
స్పూర్తి కావాలి కలాం చెప్పిన కలలు కనండి..సాకారం చేసుకోండి నిత్యం
గుర్తుంచుకోవాలి
దేశం గర్వించే శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లు మీరు
కావాలి
రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం
చేస్తున్నాం
ముఖ్యమంత్రి కేసిఆర్ పేద విద్యార్థులకు నాణ్యమైన
విద్య అందించాలని గత మూడేళ్లలో రాష్ట్రంలో 544
గురుకులాలను ఏర్పాటుచేశారన్నారు.
రాష్ట్రంలో గురుకులాలతో పాటు 475 కస్తూర్భాగాంధీ బాలికల
విద్యాలయాలు, 196 మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయని, వీటి
ద్వారా దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు నాణ్యమైన
విద్యను పొందుతున్నారన్నారు.
గవర్నర్ నరసింహ్మన్ గార్కి విద్య అన్నా, విద్యార్థుల
అన్నా… చాలా ఆసక్తి ఉందని, రాష్ట్రంలో ప్రభుత్వ
పాఠశాలలను ఏవిధంగా పటిష్టం చేస్తున్నారో ఎప్పటికప్పుడు
అడిగి తెలుసుకుంటుంటారని చెప్పారు.
రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 160 విద్యార్థుల
సంఖ్య గవర్నర్ నరసింహ్మన్ గారు చొరవ తీసుకున్న తర్వాత
1200కు పెరిగిందన్నారు.
గవర్నర్ గారి చొరవ వల్ల రాజ్ భవన్ స్కూల్ లో అన్ని వసతులు
సమకూరాయన్నారు. ప్రస్తుతం ఆ స్కూల్ తమ వద్ద సీట్లు
లేవని బోర్డు పెట్టే స్థాయికి చేరుకుందన్నారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, విద్యాశాఖ
అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.