సత్యం స్కామ్ లో రామలింగరాజును దోషి గా ప్రకటించిన కోర్టు..

సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో దాదాపు ఐదేళ్లపాటు సుదీర్ఘవాదనలు విన్న నాంపల్లి ప్రత్యేక కోర్టు గురువారం ఉదయం తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసులో రామలింగరాజు ను దోషి గా ప్రకటించింది. రామలింగరాజు , రామరాజు, సూర్య నారాయణ రాజు, వడ్లమాని శ్రీనివాస్‌, గోపాలకృష్ణన్‌, తాళ్లూరి శ్రీనివాస్‌, రామకృష్ణ, ప్రభాకర్గుప్తా‌, వెంకటపతిరాజు, శ్రీశైలం 10 మంది పై నేరం రుజువైంది. రామలింగరాజు సహా నిందితులందరూ దోషులుగా ప్రత్యేక కోర్టు నిర్థరించింది. నిందితులకు శిక్షపై వాదనలు కొనసాగుతున్నాయి. రామలింగరాజు, రామరాజు, సూర్యనారాయణరాజు, వడ్లమాని శ్రీనివాస్‌, ఆడిటర్లు గోపాలకృష్ణన్‌, తాళ్లూరి శ్రీనివాస్‌, మాజీ ఉద్యోగులు రామకృష్ణ, వెంకటపతిరాజు, శ్రీశైలం, అంతర్గత ఆడిటర్‌ ప్రభాకర్‌ గుప్తాలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 120బీ, 420, 409, 419, 467, 471, 477ఏ, 201 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *