సత్ప్ర్రవర్తన ద్వారా సత్సంబంధాలు పెరుగుతాయి

సత్ప్ర్రవర్తన ద్వారా వ్యక్తిగత హోదా పెరుగడంతోపాటు అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఏర్పడుతాయని కరీంనగర్ జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ అన్నారు. సత్ప్ర్రవర్తన పెంపొందించుకునేందుకు ప్రయత్నించాలని పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ పిరమిడ్స్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్ మెంట్ సంస్ధ సహకారంతో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని దివంగత జాన్ విల్సన్ స్మారక ఓపెన్ ఏయిర్ ధియేటర్ ఆవరణలో పోలీసులకు వారం రోజుల పాటు నిర్వహించతల పెట్టిన యోగా, ధ్యానం కార్యక్రమాన్ని సోమవారం నాడు జిల్లా ఎస్.పి డి.జోయల్ డేవిస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడుతూ యోగా, ధ్యానాలకు దినచర్యలో భాగంగా అలవర్చుకోవాలన్నారు. ఒత్తిడులను అధిగమిస్తేనే మానసికంగా, శారీరకంగా సంసిద్దంగా ఉంటామని పేర్కొన్నారు. ఎంచుకున్న లక్ష్యాలను సాధించలేకపోవడానికి ప్రధాన కారణంగా మానసికంగా, శారీరకంగా సంసిద్దంగా లేకపోవటమేనని చెప్పారు. యోగా, ధ్యానాల ద్వారా కొన్ని రకాల వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు దీర్ఘకాలిక రోగాలు అదుపులో ఉంటాయని సూచించారు. తొలివిడత శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులు వారు విధులను నిర్వహిస్తున్న ప్రాంతాల్లో తోటి పోలీసులకు శిక్షణలోని అంశాలను బోధించాలని సూచించారు. యోగా, ధ్యానం ప్రక్రియను పోలీసులకు నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి టి.అన్నపూర్ణ, ఓ.ఎస్.డి ఎల్. సుబ్బరాయుడు, ఎ.ఆర్.డి.ఎస్.పి డి.కోటేశ్వరరావు, డిపివో విభాగం ఎ.వో శ్రీనివాస్, ఆర్.ఐలు గంగాధర్, శశిధర్, టుటౌన్, త్రీటౌన్ ఇన్స్ పెక్టర్లు హరిప్రసాద్ సదానందం, జిల్లా పోలీసు అధికారులు అసోసియేషన్ అధ్యక్షులు యం.సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

police pro.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.