సత్తుసింగ్ అక్రమాల పుట్ట

ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ శివారులోని నానక్ రామ్ గూడలో సత్తుసింగ్ కు చెందిన ఆరు అంతస్థుల భవనం ఒక్క సారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా… మరో ఇద్దరు ప్రాణాలతో బయట పడి ఆస్పత్రి పాలైయారు. కూలిన ఈ ఆరు అంతస్థుల భవనానికి జీహెచ్ ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవు. బిల్డింగ్ కు సంబంధించి.. జీహెచ్ ఎంసీ, పోలీసుల విచారణలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నానక్ రామ్ గూడ బిల్డింగ్ కూలడానికి ప్రధాన కారణం… పార్కింగ్ కు అడ్డుగా ఉందనీ ఒక పిల్లర్ తొలగించడం వల్లనే బిల్డిండ్ కూలినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 180 గజాల గ్రామ కంఠం భూమిలో చేదుడు బావి ఉండేదని… అది పూడ్చి నిర్మాణం చేపటినట్లు అధికారులు గుర్తించారు. తుల్జారాం సత్తుసింగ్ మాజీ రౌడీషీటర్. అతని ఇద్దరి అన్నలు బిడ్డుసింగ్, కాలాసింగ్. ఇతనికి ముగ్గురు కొడుకులు. విదేశాల్లో పెద్దవాడు సునీల్ సింగ్ ఉండగా… అనీల్ సింగ్ రెండవ వాడు ఇల్లీగల్ తుపాకీతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు రికార్డులు చెప్తున్నాయి. సంకేత్ సింగ్ మూడవ వాడు న్యాయవాది. బందువులు, స్థానికులతో భూ వివాదాలు, కభ్జాలు చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అంతేకాదు వీరిపై గచ్చిభౌలి, రాయదుర్గం పోలీసు స్టేషన్ లో పలు కేసులు కూడా ఉన్నాయి. సంబంధం లేని హత్య కేసుల్లో సాక్షి గా ఉండి… తర్వాత నిందితులతో చేతులు కలిపి కేసును నీరు కార్చడం సత్తుసింగ్ నేర ప్రవుత్తిగా మారినట్లు తెలుస్తోంది. 2003 షేక్పేట్ ప్రవీ్ణ్ గౌడ్ హత్య కేసులో సాక్షిగా ఉండి 10 లక్షలకు కాంప్రమైజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2012 శేర్లింగంపల్లి ఎమ్మార్వో ఆఫీస్ లో జరిగిన అశోక్ రెడ్డి హత్యకేసులో సాక్షికి 50 లక్షలకు సెటెల్మెంట్లు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. నానక్ రామ్ గూడలో ఇతని కభ్జాలో మరో 2000 గజాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతనికి గచ్చిభౌలీ, టోలిచౌకి లో మరో రెండు భవనాలు ఉన్నాయి. సత్తుసింగ్ అక్రమాలకు సంబంధించి అటు జీహెచ్ ఎంసీ అధికారులతోపాటు పోలీసులు విచారణ ప్రారంభించారు.

nanakramguda-bulding2     nanakramguda-building     nanakramguda-building1

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.