
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ 2018-19 సంక్షేమ నామ సంవత్సరం అని అన్నారు. ఎస్సి,ఎస్టీ,బీసీ,మైనారిటీ అందరికి సంక్షేమపథకాలు అందిస్తామన్నారు. విద్యా పరంగా ఇప్పటికే విప్లవాత్మకమైన మార్పులు కెసిఆర్ గారు తీసుకు వచ్చారు. పేద పిల్లలకు ఒక్క రూపాయ ఖర్చు లేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. ఇక ఎవరి కాళ్ళమీద వాళ్ళు నిలబడేందుకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. గతంలో పేదలకిచ్చే స్కీమ్స్ బ్యాంకుల సహకారం లేకపోవడం వల్ల పేపర్లకే పరిమితం అవుతున్నాయని ఒక వేల మంజూరీ అయినా కూడా మధ్య దళారీల చేతిలోకి వెళ్తున్నాయి తప్ప అసలైన లబ్ది దారులకు అందడం లేదని.. అందుకే కెసిఆర్ గారు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా డబ్బు అందేలా ప్రణాళికలు తాయారు చేస్తున్నారని మంత్రి ఈటల అన్నారు.
ఇప్పటికే గొల్లకురుమలు, మత్స్యకారులకు పెద్ద ఎత్తున ప్రభుత్వసాయం అందుతుంది. అదేవిదంగా బీసీలలో ఉన్న అనేక కులాలకు ఏ చేస్తే బాగుపడతారు అనే అంశంపై ఇప్పటికి 50 సార్లు జోగు రామన్న గారి అధ్యక్షతన సమావేశం అయ్యారు. స్పీకర్ గారు కూడా అన్నికులాల్తో అసెంబ్లీ వేదికగా సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలూ తీసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి తోనే బంగారు తెలంగాణ సాధ్యం అని కెసిఆర్ గారి ఆలోచన. అందుకు
అనుగుణంగాసి బీసీ ఎంపీ, mla,mlc సమావేశంలో సీఎం .. చాల ఉద్వేగంగా మాట్లాడారు.. ఒక్క రోజు కాకపోతే పది రోజులైనా చర్చించి ఈ వర్గాలు బాగుపడాలంటే ఎం చేయాలో నన్ను ఆదేశించండి నేను GO ఇస్తా అని సీఎం గారు చెప్పారు. సీఎం గారి ఆదేశాలతో జోగు రామన్న గారి నాయకత్వంలో అన్ని కుల సంఘాలతో , అధికారులతో సమావేశం నిర్వహించి నివేదిక సిద్ధం చేసారు.
దీనిని సీఎం గారికి సమర్పించనున్నాం. సంచార జాతుల వారికీ లక్ష రూపాయల లోన్ ఇవ్వబోతున్నాం.. నాయి బ్రాహ్మణులు కొత్తగా షాప్స్ పెట్టుకోవడానికి, ఉన్న షాపులను ఆధునీకరించడానికి నిధులు ఇవ్వబోతున్నాం.ఇప్పటివరకు చాకిరీ చేసే దగ్గర మన వాళ్ళు ఉంటున్నారు.. డబ్బులు వచ్చే దగ్గర బడా బాబులు ఉంటున్నారు. ఇక మీదట పని చేసే వాడికి పూర్తి ఆదాయం అందలి అనేదే తమలక్ష్యం అని మంత్రి ఈటల అన్నారు. ముందుగా సంచార జాతులు, ఆతరువాత రజక, నాయి బ్రాహ్మణ, విశ్వకర్మ లకు వృత్తుల వారీగా నిధులు కేటాయించేందుకు నివేదిక సిద్ధం అయ్యిందన్నారు. సీఎం గారి ఆమోదం తెలిపిన వేంటనే ఈ నెలలోనే గ్రౌండ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇది కుల వృత్తుల, అణగారిన వర్గాల సంవత్సరం అని అన్నారు.