
చెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించండి.
చెక్కర కర్మాగారాల యజమానులకు మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆదేశం
సచివాలయంలో చెరకు రైతు సమస్యలపై మంత్రి హరీష్ రావు, కేటీఆర్ సమీక్ష
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జెహీరాబాద్ జిల్లా పరిధిలోని చెరకు రైతుసమస్యల పై మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సమీక్ష నిర్వహించారు. రైతులకు చెరుకు కర్మాగారాల యజమానులు చెల్లించాల్సిన బకాయిలపై ప్రధానగా చర్చ జరిగింది. ఇందులో అధికారులతో పాటు, చెరకు కర్మాగారాల యజమానులు పాల్గొన్నారు. చెరకు రెతులకు చెల్లించాల్సిన బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని ఇరువురు మంత్రులు చెరకు ఫ్యాక్టరీ యాజమాన్యాలను ప్రశ్నించారు. దాదాపు 4 లక్షల 59 వేల మెట్రిక్ టన్నుల చెరకును ఈ ఫ్యాక్టరీలు వినియోగించాయని, రైతులకు 57 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో రైతులు ఆందోళనలో ఉన్నారన్నారు.దీనిపై స్పందించిన మంత్రులు వెంటనే రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలన్నారు. ఈ నెలలో 25 కోట్లు, వచ్చె నెలలో 32 కోట్లు రెండు విడతలుగా చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకు అన్ని వసతులు సమకూర్చుతుంటే,కొందరు ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారని ఇది తగదని మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు చెప్పారు. ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకార ఏదైనా ఉంటే తాము అందిస్తామని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని చెరకు ఫ్యాక్టరీ యజమానులకు మంత్రులు సూచించారు.