సచివాలయంలో అటవీశాఖ వీడియో కాన్ఫరెన్స్

*హరితహారం పురోగతి, అర్బన్ పార్క్ ల అభివృద్ది, ఎవెన్యూ ప్లాంటేషన్ పై సచివాలయంలో అటవీశాఖ వీడియో కాన్ఫరెన్స్*

 

*వర్షాలు వచ్చే లోగా హరితహారంలో ప్రత్యామ్నాయ పనులపై దృష్టి

*ఇప్పటికే నాటిన మొక్కల రక్షణ, నీటి సౌకర్యం ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు*

 

*పెద్ద మొత్తంలో మొక్కలు నాటినచోట తప్పనిసరిగా ఫెన్సింగ్ ఏర్పాటు*

 

*పట్టణ ప్రాంతాల్లో సుందరమైన అర్బన్ పార్క్ ల ఏర్పాటుకు ప్రాధాన్యత*

 

*అదిలాబాద్, నాగపూర్ హైవేపై ఎవెన్యూ ప్లాంటేషన్ పనుల ప్రారంభం*

 

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షాభావ పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగే అవకాశమున్నందున హరితహారంలో భాగంగా నాటిన మొక్కల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లాల అధికారులను అటవీ శాఖ ఉన్నతాధికారులు కోరారు. డ్రై స్పెల్ రోజుల్లో హరితహారంలో ప్రత్యామ్నాయ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. మూడో విడత హరితహారంలో భాగంగా ఇప్పటికే 17 కోట్లకుపైగా మొక్కలు నాటడం పూర్తి అయిందని అధికారులు వెల్లడించారు. తాజా పరిస్థితిపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో అటవీశాఖ ఉన్నతాధికారులు సమీక్షించారు.  ప్రజలు, గ్రీన్ బ్రిగేడ్, పారిశ్రామిక, స్వచ్చంద సంస్థల సహకారంతో మొక్కలకు నీటి సౌకర్యాన్ని కొనసాగించాలని తెలిపారు.   పెద్ద మొత్తంలో మొక్కలు నాటిన బ్లాక్ ప్లాంటేషన్ రక్షణ కోసం తప్పని సరిగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోడ్లు, గ్రామాల వెంట నాటిన మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు. చనిపోయిన మొక్కలను మార్చి కొత్తవి పెట్టడం, మళ్లీ వర్షాల సమయంలో నాటే మొక్కల కోసం ముందుస్తు పిట్టింగ్ ( గుంతలు తవ్వటం) తగిన సంఖ్యలో చేపట్టాలని చెప్పారు. కచ్చితమైన ప్రణాళికతో ఈ పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా అటవీ శాఖ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఇక నేషనల్ హైవేస్ అథారిటీ నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నందున అదిలాబాద్ హై వేపై ఎవెన్యూ ప్లాంటేషన్ ను మూడు వరుసల్లో చేపట్టాలని, ప్రతీ 5 కిలో మీటర్లకు ఒక థీమ్ ప్రకారం.. పూలు, నీడను ఇచ్చే మొక్కలను నాటాలని ఆదేశించారు. రైల్వేస్, ఎన్టీపీసీ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున తమ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేస్తున్నందున వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అటవీ శాఖ బ్లాక్ ల్లో అర్బన్ పార్క్ ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పట్టణ ప్రాంతాల వెంట ఉన్న అటవీ భూముల్లో వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇలాంటి పార్క్ లకు వచ్చేవారి అటవీ సంరక్షణ ప్రాధాన్యతను తెలుసుకోవటం పాటు, బిజీ లైఫ్ నుంచి సేద తీరేలా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు.

 

సమీక్షలో ఇంకా.. ప్రాజెక్టుల కోసం భూ సేకరణ, అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమి కేటాయింపు, వర్షాకాలంలో అటవీ జంతువుల రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, అటవీ సంపద సంరక్షణ, కంపా నిధులతో చేపట్టిన పనుల పర్యవేక్షణ, అటవీ ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసేచోటే నివాసం లాంటి అంశాలపై చర్చించారు.

 

అటవీ సంరక్షణ ప్రధాన అధికారి( వైల్డ్ లైఫ్) గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మనోరంజన్ భాంజాను వీడియో కాన్ఫనెన్స్ లో అధికారులు, సిబ్బంది అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్ లో  అదనపు అటవీ సంరక్షణ అధికారులు పృధ్వీరాజ్, రఘువీర్, మునీంద్ర, డోబ్రియల్, లోకేష్ జైస్వాల్, సునీల్ కుమార్ గుప్తా, శోభ, స్వర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.

haritha haram 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *