Breaking News

సకుటుంబ సపరివార సంగమం

01kcr

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ సకుటుంబ సపరివారంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు.. లోక కళ్యాణం కోసం అయుత చండీయాగం చేయడం అభినందనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సీఎం కేసీఆర్ ను అభినందించారు. యాగ నిర్వహణతో తెలంగాణ ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంచారని రాష్ట్రపతి ప్రశంసించారు.

సీఎం కేసీఆర్, ఆయన సతీమణి , కుమారుడు కేటీఆర్, ఆయన సతీమణి, ఎంపీ కవిత కుటుంబం మనమలందరూ కలిసి రాష్ట్రపతిని కలిశారు.. ఆదివారం చండీయాగానికి రావాల్సిన రాష్ట్రపతి యాగంలో అగ్ని ప్రమాదంతో వెనుదిరిగారు. దీంతో కేసీఆర్ కు ఫోన్ చేసి తనను కలవాలని కోరారు. దీంతో కేసీఆర్ రాష్ట్రపతి ఇంటికి వెళ్లి సకుటుంబ సపరివారంగా కలిశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *