సంస్మరణ వేళ పోలీసులకు కేసీఆర్ వరాలు..

అక్టోబర్ 21న అయిన నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. ఈ సందర్బంగా హైదరాబాద్ లోని గోషా మహల్ లోని అమరవీరుల స్తూపానికి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ పోలీసులపై వరాల జల్లు కురిపించారు.

కానిస్టేబుల్ నుంచి ఏఎస్సై వరకు మున్సిపాలిటీల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హెడ్ హోంగార్డులకు కూడా ఇది వర్తింప చేశారు. పోలీసుల త్యాగాలు మరువలేనివని.. వారికి ఎంత చేసినా తక్కువేనన్నారు. అంతేకాదు బంజారాహిల్స్ లో 24 అంతస్థుల్లో పోలీస్ లకు అత్యాధునిక కంట్రోల్ వ్యవస్థ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.  ట్రాఫిక్ పోలీసులకు అలవెన్స్ ను 3500 నుంచి 7500 కు కేసీఆర్ పెంచుతున్నట్లు ప్రకటించారు. సివిల్ పోలీసులకు కూడా పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *