Breaking News

సంవత్సరన్నర అయినా దేశంలో పర్యటించలే..

KT-Rama-Rao

హైదరాబాద్ : ప్రధాని మోడీ సంవత్సరన్నరలో ప్రపంచంలోని 50 దేశాల్లో పర్యటించారని.. కానీ తెలంగాణతో సహా చాలా రాష్ట్రాల మొహం చూడని ప్రధాని మనకు అవసరమా అని ప్రజలు తిరస్కరిస్తున్నారని అన్నారు తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ లో టీఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ టీడీపీ కార్యకర్తలకు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ మోడీ పాలనపై నిప్పులు చెరిగారు.

సొంత దేశంలో పర్యటించకుండా విదేశీ యాత్రలు చేస్తున్న మోడీని అందుకే వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో జనం ఓడిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా కాంగ్రెస్ చేతిలో ఓడించారన్నారు. మోడీవి జన్ దన్, స్వచ్ఛ భారత్ పథకాలు మాత్రమేనని. వాటి వల్ల జనానికి ఏం ఉపయోగం లేదన్నారు. అదే కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు 40 పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *