Breaking News

సంబరాల్లో మునిగితేలుతున్న ఉద్యోగులు

prc

హైదరాబాద్, ప్రతినిధి :  చరిత్రలో ఎన్నడూ లేనంతగా 43శాతం ఫిట్ మెంట్ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఉద్యోగుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎక్కడ ఇద్దరు ఉద్యోగులు కనిపించినా.. ఏ ఫోన్ లో చూసినా నిన్నటి నుంచి ఫిట్ మెంట్ చర్చే.. ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఇంతలా ఫిట్ మెంటును ఉద్యోగులకు ప్రకటించలేదు.. ఈ ఫిట్ మెంట్ ప్రకటనపై ఉద్యోగులు టాపాసులు కాల్చి సచివాలయం ఎదుట హంగామా చేశారు.

ఫిట్ మెంట్ ప్రకటించిన అనంతరం సీఎం మాట్లాడుతూ పీఆర్స్సీ ఇంతలా పెంచటం పీఆర్స్సీ చరిత్రలో ఎప్పూడు లేదని తెలిపారు. శాసన మండలి ఎన్నికలు సమీపిస్తున్నందున వెంటనే పీఆర్స్సీ పై నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జూన్ 2 నుంచి ఈ ఫిట్ మెంట్ ను అమలు చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మె చేసి చరిత్రలో నిలిచిపోయారని.. వారి సేవలకు ఇది చాలా తక్కువన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *