సంపన్నుడి కారు ఖరీదు అన్ని కోట్లా.?

2e1ax_timeless_entry_Mukes-Ambani-cars

దేశంలోనే సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ. దాదాపు 4500 కోట్లతో ముంబైలో దేశంలోనే అత్యంత ఖర్చుతో నిర్మించిన ఇల్లు ఆయనకుంది. ప్రత్యేకంగా తయారు చేయించుకున్న జెట్ ఫ్లైట్ ఉంది. ఆయన జీతం సంవత్సరానికి 15 కోట్లు. ఇంకా ఆయనకు కంపెనీలు షేర్ ఉంది. అలాంటి వ్యక్తి కారుకోసం ఎంతైనా ఖర్చు పెట్టిన తప్పులేదు కదా.. అదే జరిగింది.

ముకేష్ అంబానీ కోసం రిలయన్స్ యాజమాన్యం అత్యాధునిక సెవెన్ సిరీస్ బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేసింది. దీన్ని ప్రత్యేకంగా ముకేష్ మరికొన్ని అదనపు హంగులను జోడించి తయారు చేయించింది. ఈ కారుకోసం రిలయన్స్ బీఎండబ్ల్యూ జర్మనీ కార్లకంపెనీకి దాదాపు 8.5 కోట్లను చెల్లించింది. కారు లోపల, బయట అదనంగా హంగులు సమకూర్చుకుంది. కారు పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్, బాంబులు, మందుపాతరలు పేల్చినా ఏం కాదు.. కిటీకీలు, అద్దాలు పూర్తిగా బుల్లెట్ ఫ్రూఫ్ సో దీనికోసం 8.5 కోట్లు ఖర్చయింది.

కాగా దీనిని 1.9 కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్ అనంతరం దిగుమతి కోసం 300 శాతం ప్రభుత్వానికి దిగుమతి సుంకం కట్టాలి. ఇక మహారాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోసం ఖరీదులో 20 శాతం అంటే 1.6 కోట్లను రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించారట.. మహారాష్ట్ర మోటార్ రిజిస్ట్రేషన్ లోనే ఇదొక రికార్డు అని అధికారులు చెబుతున్నారు.

Mayback-Mukesh-Ambani

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *