Breaking News

సంధ్యారాణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని యాదవ్

సంధ్యారాణి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని యాదవ్

రాష్ట్ర్ర్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్ర్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రకువారం లాలాపేటలో సంధ్యారాణి మృతదేహన్ని సందర్శించి ఆమె మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రేమోన్మాది కార్తీక్ చేతిలో సంధ్యారాణి తీవ్రంగా గాయపడి గాంధీ  ఆసుసత్రిలో చికిత్సపొందుతూ శ్రకువారం ఉదయం మరణించింది. మంత్రి మాట్లాడుతూ ఈ సంఘటన చాలా బాధాకరం అన్నారు. సంధ్యారాణి మృతికి కారకుడైన కార్తీక్ కు కఠిన శిక్ష పడేవిధంగా ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుందన్నారు. సంధ్యారాణి తన కుటుంబాన్ని పోషిస్తుందని, ఆమె మృతితో ఆ కుటుంబం మరింత ధీనస్ధితిలో పడుతుందన్నారు. నిరుపేదలైన సంధ్యారాణి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా  ఆదుకుంటుందని చెప్పారు. ఎవరైనా ఆకతాయిలు పదేపదే వేదిస్తుంటే సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని అన్నారు.  సంధ్యారాణి కుటుంబానికి మంత్రి ఈ సందర్భంగా 25 వేల రూపాయల ఆర్ధిక సహయం అందజేశారు. కార్పోరేటర్ ఆలకుంట సరస్వతి, గ్రేటర్, హైదరాబాద్ టీఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు ఆలకుంట హరి లు సంధ్యారాణి  మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *