Breaking News

‘సందర్భా’నుసారం కేసీఆర్ ను కడిగేశాడు..

andrajyothy--02

హైదరాబాద్, ప్రతినిధి : ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్ గారు సందర్భాను సారం సీఎం కేసీఆర్ మనస్తత్వాన్ని, వైఖరిని కడిగిపారేశారు. ఆయన జనం కోసం మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అధికారంలో ఉన్న వాళ్లు.. మంచి, చెడు, బాధలు, సాదకాలు వినాలని.. విన్నప్పుడే నాయకుడి తప్పు ఒప్పులు తెలుస్తాయని సునిశిత విమర్శలు చేశారు.

ఆంధ్రజ్యోతిలో ‘సందర్భం’ శీర్షికను ఎడిటర్ కే.శ్రీనివాస్ ఈసారి కేసీఆర్ చేస్తున్న తప్పులను ఎత్తిచూపారు. ‘స్వభావ సరళి వల్లనే అనేక సమస్యలు’ అంటూ ఎడిటోరియల్ లో కేసీఆర్ వ్యవహార శైలిని ఎత్తిచూపారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న తప్పులు సీఎంగా ఆయన చేయకూడని పనులను చాటిచెప్పారు. దళితుడైన రాజయ్యను కేబినెట్ నుంచి తొలగించి దళితుల ఆగ్రహానికి గురికావడం.. ప్రజాస్వామ్యంలో 7 నెలలు గడుస్తున్నా ఏబీఎన్, టీవీ9 చానాళ్లను నిషేధించడం వంటి చర్యలు దీర్ఘకాలంలో ఆయనకు చేటు తెస్తాయని విమర్శించారు. ఇది ఆయన వ్యక్తిత్వంలోని తీవ్రలక్షణాలను, వ్యక్తిగత స్వభావాన్ని తెలియజేస్తుందని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *