
??
జై కొట్టు జవాను ఉయ్యాలో…
భారత జవాను ఉయ్యాలో…
మీకు వందనాలు ఉయ్యాలో… బాడర్ల సైనిక ఉయ్యాలో…
తిండి తిప్పలు లేక ఉయ్యాలో.. కంటి కునుకు లేక ఉయ్యాలో..
భార్యాపిల్లల్నిడిచి ఉయ్యాలో… బందూకు పట్టి ఉయ్యాలో…
దేశ రక్షణకోసముయ్యాలో… పయనమయితిరా ఉయ్యాలో..
మీ మెరుపు దాడులతో ఉయ్యాలో. మీ చాకచక్యంతో ఉయ్యాలో..
శత్రు సైన్యాలను ఉయ్యాలో .. తోకముడిచేటట్టు ఉయ్యాలో
భారత దేశాన్ని ఉయ్యాలో .. కాపాడవడ్తిరి ఉయ్యాలో ..
అటైనా పాటైనా ఉయ్యాలో …
ఏ యుద్ధరంగమైన ఉయ్యాలో..
భారతే గెలవలె ఉయ్యాలో .. ద్రోహుల్లా గుండెల్లో ఉయ్యాలో..
పరాయి దేశాలకు ఉయ్యాలో.. పక్కలు వేసేటి ఉయ్యాలో..
తిన్నింటి వాసాలు ఉయ్యాలో .. లెక్కించే వాళ్లంతా ఉయ్యాలో
నాశనం అవ్వాలి ఉయ్యాలో.. భారతు గెలవాలి ఉయ్యాలో..
నా దేశ సంస్కృతిని ఉయ్యాలో… వ్యతిరేకించేటోడు ఉయ్యాలో…
నాశనం కావాలె ఉయ్యాలో .. భారతు గెలవలె ఉయ్యాలో..
ఉగ్రవాదం పోవాలే ఉయ్యాలో .. ఉన్మాదం తరమాలి ఉయ్యాలో
సొదరాభావంతో ఉయ్యాలో… కలిసి మెలగాలి ఉయ్యాలో..
ప్రకృతిని కాపాడి ఉయ్యాలో.. స్వచ్ఛ భారతవ్వాలి ఉయ్యాలో..
వీరజవనన్న ఉయ్యాలో ..
నీకు సలామన్న ఉయ్యాలో
క్షేమంగా ఉండయ్య ఉయ్యాలో .. లాభంగా రావయ్యా ఉయ్యాలో..
నిండు నూరేళ్లు ఉయ్యాలో .. జీవించావయ్యా ఉయ్యాలో..
భారతీయులమంతా ఉయ్యాలో… మీ వెనుక ఉన్నాము ఉయ్యాలో
యుద్ధరంగoలోన ఉయ్యాలో …
తెగించు కొట్టాడు ఉయ్యాలో…
ద్రోహుల గుండెల్లో ఉయ్యాలో .. భారతు గెలవలె ఉయ్యాలో…
వీరమరణం పొంది ఉయ్యాలో .. మా మదిలో నిలిస్తీరా ఉయ్యాలో
భారతీయులమంతా ఉయ్యాలో .. గుండెల్ల బరువుతో ఉయ్యాలో
చరిత్ర పుటల్లో ఉయ్యాలో .. రాసుకుంటాము ఉయ్యాలో ..
మీ ధీరత్వాన్నికి ఉయ్యాలో… లాల్ సలమన్న ఉయ్యాలో….