సంతానలేమి సమస్య తెలిసింది..

 పిల్లలు లేని జీవితం వ్యర్థం అనుకుంటున్నారు నేట తల్లిదండ్రులు.. అందుకే ఎలాగైనా పిల్లలు కావాలని  ఐవీఎఫ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వెలిసి సంతానలేమితో బాధపడుతున్న వారికి ఆ పుత్రపాప్తి కల్పిస్తున్నాయి. అంతా బాగానే ఉన్నా దీనికోసం లక్షలు వసూలు చేస్తున్నాయి. కొందరికి శుక్రకణాల సమస్య, కొందరికి అండాల విడుదలలో జాప్యం ఏదైనా సంతాన లేమి అనేది ప్రైవేటు ఆస్పత్రులకు కాసులు కురిపిస్తోంది.. చాలారోజులుగా శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. అండం, శుక్రకణం కలిసి పిండం ఏర్పడే ప్రక్రియ చాలా క్లిష్టమైనది.. చాలా ప్రక్రియలు ఇందులో జరుగుతాయి. దీంతో ఎక్కడ పిల్లలు పుట్టడానికి అవరోధమో శాస్త్రవేత్తలు కచ్చితంగా ఇప్పటివరకు కనిపెట్టలేదు. దీంతో కృతిమ పిండం తయారు చేసి కడుపులో ప్రవేశపెట్టి బిడ్డల్ని కనిపించేస్తున్నారు.కానీ ఇన్నాళ్లకు కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మగాళ్ల శుక్రకణం తోక విడిపోతేనే అండంతో కలిస్తుందని తేల్చారు. శుక్రకణం తోక భాగంలో ఉండే ప్రోటీన్ గ్రాహకాలు.. మహిళల శృంగార హార్మోన్ ప్రొజెస్టీరాన్ తో జతకలిసి తోక తెగిపోతుంది. దీంతో శుక్రకణం అండంలోకి వెళ్లి పిండం అవుతుంది.. శుక్రకణం తోక తెగకపోతే పిండం కాదన్నమాట..

ఈ పరిశోధనలో మహిళల ప్రొజెస్టిరాన్ , శుక్రకణం ప్రోటీన్ గ్రాహకాలు సంగమం జరిగితేనే పిల్లలు పుడతారని శాస్త్రవేత్తలు తేల్చారు. దీంతో త్వరలోనే పుల్లలు పుట్టడానికి, పుట్టకపోవడానికి కారణమయ్యే మందులు తయారు చేయడానికి రెడీ అవుతున్నారు. మరో రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయి. సంతానలేమి బాధితుల సమస్యలు తీరుతాయన్నమాట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *