
ముంబై, ప్రతినిధి : బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు పండుగ సెలవులొచ్చాయి.. ఖల్‌నాయక్‌కు రెండువారాలపాటు ఇంటి భోజనం తినే ఛాన్స్ కలిగించారు యరవాడ జైలు అధికారులు. అక్రమ ఆయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్‌దత్.. తనకు కొద్ది రోజులు సెలవు కావాలంటూ చేసిన అభ్యర్ధనకు జైలు అధికారులు సానుకూలంగా స్పందించారు.
ఈ కేసులో పడ్డ అయిదేళ్ల శిక్షా కాలంలో ఇప్పటికే సంజయ్‌దత్ పద్దెనిమిది నెలలు శిక్ష అనుభవించాడు. శిక్ష అనుభవించే ప్రతి ఖైదీకి తాత్కాలిక సెలవులు వినియోగించుకునే అవకాశం ఉంటుందనీ, ఆ నిబంధనల మేరకే ఆయనకు రెండువారాలపాటు సెలవుఇచ్చినట్టు పోలీసు అధికారులు తెలిపారు. అయితే తన సెలవును మరో రెండు వారాలు పొడిగించాల్సిందిగా సంజయ్ దత్ కోరవచ్చని తెలుస్తోంది. ఆయనకు పెరోల్ ఇవ్వడంపై కొందరు ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.