
రిలయన్స్, రిలయన్స్ జియో నెట్ వర్క్స్ కొత్త ఆఫర్ ను ప్రకటించాయి. కేవలం 93 రూపాయలకే 4జీ డేటాలో 10జీబీ డేటాను అందిస్తున్నాయి.. ఈ ఆఫర్ కేవలం రిలయన్స్, కొత్త రానున్న రిలయన్స్ జియో నెట్ వర్క్స్ పై మాత్రమే లభిస్తుంది.
ఈ ఆఫర్ మిగతా అన్ని నెట్ వర్క్ లకంటే చాలా తక్కువ ధర.. 100 రూపాయలకు ఏ నెట్ వర్క్ లో కూడా 1 జీబీ డేటా రావడం లేదు. కనీసం 250 రూపాయలు పెడితే కానీ 1జీబీ డేటా ఐడియా, ఎయిర్ టెల్ లో వస్తోంది. ఇలా రిలయన్స్ 93 రూపాయలకే 10 జీబీ పెట్టడంతో ఇక రిలయన్స్ కస్టమర్స్ పండుగ చేసుకున్నట్టే..