సంక్షేమ పధకాల నినాదాలను నిజం చెయ్యాలి: మంత్రి జగదీష్ రెడ్డి

సంక్షేమ పధకాల నినాదాలను నిజం చెయ్యాలి: మంత్రి జగదీష్ రెడ్డి

దళితుల అభివృద్ధికి 14,375. 3 కోట్లు

జనవరి మాసాంతానికి 6,689 కోట్లు ఖర్చు పెట్టాం

బడ్జెట్ కేటయింపుల ప్రకారం దళితుల జనాభా నిష్పత్తి ప్రకారం 16.32%

197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలతో దళితుల అభ్యున్నతి

ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి కావటానికి మరో 50 రోజుల గడువు ఉంది

45 నుండి 50 రోజులలలో నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు

నిధులు మురిగి పోకుండా పనులను వేగవంతం చేసే విధంగా అధికారులకు ఆదేశాలు

షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం దేశానికే ఆదర్శంగా మారింది

కులాల వారీగా సమాజం విడిపోయింది

అటువంటి సమాజాన్ని సంస్కరించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చట్టాన్ని అమలులోకి తెచ్చారు

అభివృద్ది నిధి పద్దు ఖర్చులు పారదర్శకంగా ఉండాలి

అదనపు బడ్జెట్ కేటయింపులతోటైనా దళితుల అభివృద్ధికి తోడ్పడాలి

షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలుపై జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి

దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందెన్నడూ లేని రీతీలో మొట్టమొదటి సారిగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి నిధి చట్టం అమలులోకి తెచ్చిందని రాష్ట్ర విద్యుత్, యస్.సి అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ చట్టం ఇప్పుడు యావత్ భారతదేశానికే ఓకే రోల్ మోడల్ గా మారిందని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టం అమలు తీరు తెన్నులపై సోమవారం రోజున సచివాలయంలో ఆయన అధ్యక్ష్తన జరిగిన  సమీక్షా సమేవేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ చట్టం అమలులోకి తెచ్చిన మొదటి సంవత్సరమే పెద్ద ఎత్తున నిధులు కేటయించి దళితుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పిట్ వేసిందన్నారు.జనాభా నిష్పత్తి ప్రకారం 16.32% అంటే మొత్తం 14,375 కోట్లు కేటయించిన ప్రభుత్వం ఇప్పటి వరకు 6,689. కోట్లు ఖర్చు పెట్టినట్లు మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తి కావడానికి మరో 50 రోజులు మిగిలి ఉందని మరో 45 నుండి 50 రోజులలో దళితులకు కేటయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు పెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయన్నారు . మొత్తం 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలతో దళితుల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ఇప్పుడిప్పుడే సత్ఫాలితాలు వస్తున్నాయన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో యస్.సి స్టడీ సర్కిల్ కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఉండేదని ఇప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. విద్యను పూర్తి చేసుకున్న దళిత విద్యార్థులు ఉద్యోగ పోటీ పరీక్షల కోసం ఇచ్చే శిక్షణకు ఉద్దేశించబడిన స్టడీ సర్కిల్ విస్తరించన మీదటనే 100 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు.దళితుల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టె ప్రతి పైసా పారదర్శకంగా ఉండేలా చూడడంతో పాటు లబ్ది పొందిన లబ్ధిదారుల వివరాలను పెన్ డ్రైవ్ ద్వారా ప్రజాప్రతినిధులందరికి అందచేయడం జరిగిందన్నారు. కేటయింపులకు మించి ఖర్చు చేసిన రోజునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన ప్రయోజనం చేకూరుతుందన్న విషయం అధికారులు గుర్తించాలన్నారు. నిర్ణిత గడువు తేదీ లోపు నిధులు ఖర్చు చేయ్యాలని మంత్రి జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

భారతదేశంలో కులాల వారీగా సమాజం విడిపోయిందన్నారు. అటువంటి పరిస్థితులలో మంచి సమాజాన్ని నిర్మించాలన్న బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చట్టానికి అంకురార్పణ చుట్టారన్నారు. ఇప్పటివరకు నినాదాలకె పరిమితమైన దళితుల సంక్షేమ పధకాలు ఈ చట్టం అమలుతో ఆచరణలో కార్యరూపం దాల్చాయాన్నారు.  మొత్తం 42 శాఖాధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య , రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు ,యస్.సి అభివృద్ధి కార్యదర్శి జ్యోతి బుద్ధా ప్రసాద్ , పాఠశాల విద్యా శాఖ సంచాలకులు కిషన్ ,గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ,వ్యవసాయశాఖ కమిషనర్ జగన్ మోహన్,షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డైరెక్టర్ కరుణాకర్,జెనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *