Breaking News

సంక్షేమ పధకాల అమలు వేగవంతం చేయాలి

సంక్షేమ పధకాల అమలు వేగవంతం చేయాలి

కరీంనగర్: ప్రభుత్వ సంక్షేమ పధకాల అమలు వేగవంతం చేసి అర్హులైన లబ్దిదారులకు అందజేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో బిసి కార్పోరేషన్ ద్వారా చేపడుతున్న సంక్షేమ పధకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వెనుకబడిన తరగతుల సహకార సంఘాల ఆర్దిక బలోపేతానికి ప్రభుత్వం చేయూతలో భాగంగా ఈ సంవత్సరం 85 యూనిట్లకు రూ. 1275 లక్షలు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎంపిడివోలు, మునిసిపల్ కమీషనర్ల ద్వారా 111 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ తెలిపారు. సహకార సంఘాలు క్రమబద్దంగా వున్నవి, ఆడిట్ రిపోర్టుల ప్రకారం ఎంపిక చేసి ఆర్దిక చేయూత ఇవ్వాలన్నారు. సంఘం గతంలో బుణం తీసుకున్నది, మొత్తం చెల్లింపుచేసినది చూడాలన్నారు. బ్యాంకుల నుండి ఇచ్చిన బుణం తిరిగి కట్టే విధంగా చర్యలుండాలన్నారు. సంఘాల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసి, త్వరితగతిన లక్ష  లక్ష్యం సాధించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సంయుక్త కలెక్టర్ డా. ఏ. నాగేంద్ర, పిడి డిఆర్ డిఏ అరుణశ్రీ, డిడి బిసి సంక్షేమం మంజుల, ఇడి బిసి కార్పోరేషన్ ఇందిర తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *