సంక్షేమ పథకాలను చూసి ఆదరించండి

సంక్షేమ పథకాలను చూసి ఆదరించండి

తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని, ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. ధర్మారం మండలం కొత్తపల్లి, ఎర్రగుంటపల్లి, బంజేరుపల్లి, లంబడితాండ(K)ల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. చిన్న గ్రామ పంచాయతీలతోనే గ్రామాలు అభివృద్ది చెందుతాయన్నారు నియోజకవర్గాన్ని గడచిన నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి అవకాశమిస్తే అద్భుతంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఎమ్మెల్యేగా తనకు మరోసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేపట్టని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో చేసి చూపించామన్నారు. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఎక్కడా లేని పథకాలు ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

koppula-eshwar 1     koppula-eshwar 2     koppula-eshwar 3     koppula-eshwar 4     koppula-eshwar 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *