
చైన్నై,ప్రతినిధి : శంకర్ రెండేళ్లుగా ఎంతో శ్రమకోర్చి తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ ‘ఐ’ సంక్రాంతి బరిలో నిలవబోతోంది. గ్రాఫిక్ వర్క్స్ ఆలస్యం అవుతుందని వార్తలొచ్చినా మూడ్రోజుల క్రితం తమిళ వెర్షన్ సెన్సార్ పూర్తి అవడంతో ట్రేడ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. లేటెస్ట్గా రిలీజైన థియేటర్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూటర్స్‌లో బిజినెస్ హీట్ స్టార్ట్ అయిందని సమాచారం.
రజనీ ‘లింగ’ తెలుగు వెర్షన్ బయ్యర్స్‌కు భారీ నష్టాల్ని తెచ్చే దిశలోవున్నా.. ‘ఐ’ మీద స్టార్ హీరోల రేంజ్లో రేటు పలుకుతున్నట్టు సమాచారం. తాజాగా ఉత్తరాంధ్ర -4 కోట్లు, గుంటూరు -3.6, తూర్పు గోదావరి జిల్లా-3, కృష్ణా -2. 25 కోట్లకు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళం మాదిరిగానే జనవరి 9న తెలుగులో రిలీజ్ చేయడానికి వున్న ఇబ్బందుల్ని దాటుకొని గుడ్ టాక్ వస్తే.. ప్రాఫిట్స్‌కు డోకా ఉండదని బయ్యర్స్ టాక్.