
అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. రాగినీ గుణసమర్పణలో భారత దేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రిడి చిత్రం ‘రద్రమదేవి’. అనుష్క జోడిగా చాళుక్య వీరభద్రుడి పాత్రలో దగ్గుబాటి రానా నటించగా, కీలకమైన పాత్ర లో గోన గన్నారెడ్డిగా అల్లుఅర్జున్ నటిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
కాకతీయ వీరనారి రాణి రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే న్యూఇయర్ కానుకగా ‘రుద్రమ దేవి’ చిత్రానికి సంబంధించిన అనుష్క ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆమె రెగల్ లుక్కు చక్కటి స్పందన వచ్చింది. ప్రస్తుతం అటుపోట్లను ఎదుర్కొంటున్న గుణశేఖర్ ఈ చిత్రానికి ఎంతో కష్టపడుతున్నాడంట. మరి ‘రుద్రమదేవి’ చిత్రం ఎలాంటి ఫలితం ఇవ్వనుందో వేచి చూడాలి.