
చైన్నై, ప్రతినిధి : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విలక్షణ నడుడు కమల్ హాసన్ మూవీ ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి సందర్భంగా కమల్ హాసన్ నటించిన ‘ఉత్తమ విలన్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఇందులో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఉత్తమన్ అనే రోల్ లోో 8వ శతాబ్దానికి చెంది డ్రామా యాక్టర్ గా .. మరోవైపు మనోరంజన్ అనే క్యారెక్టర్ లో కూడా కనిపించనున్నాడు. ఈ రెండింటిలోనూ తనదైన శైలిలో కమల్ నటించాడని యూనిట్ సభ్యులు కితాబిస్తున్నారు. ఇందులో సౌత్ కి చెందిన మరో నలుగురు అగ్రహీరోలు కనిపిస్తారని సమాచారం.
ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమల్ దీని పోస్టు ప్రొడక్షన్ పనులు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో హాలీవుడ్ నిపుణులతో పనులు చేయిస్తున్నారట. ఇటీవల మరణించిన కమల్ గురువు, దర్శకుడు బాలచందర్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. కమల్ ప్రెండ్ రమేశ్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా, పార్వతి హీరోయిన్లు, ప్రస్తుతానికి తమిళ ట్రైలర్ మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగు వర్షన్ ఇంకా చాలా సమయం పడుతుందట.. ఫిబ్రవరిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.