షోలాపూర్ లో పని ఉన్నా, అభివృద్ధి సున్నా

-ఇప్పటికే అక్కడ సైకిళ్లమీదే వెళ్తారు..
– కార్మికుల బండచాకిరీ.. వారి పిల్లలు నిరక్ష్యారాస్యులే..
-పోలీసులు కంటికైనా కనపడరు..
-రేకులతో ఇండ్లు, రోడ్ల మీద ఎక్కడికక్కడ చెత్తాచెదారం..
-కంపుకొడుతున్న కాలనీలు..
-మహారాష్ట్రలోని షోలాపూర్ దుస్థితిది..

సోలాపూర్ నుంచి ప్రత్యేక ప్రతినిధి : అభివృద్ధిలో చూస్తే అంతా మహారాష్ట్ర పేరునే చెప్పుకుంటారు. అక్కడి నుంచి పెద్ద పెద్ద నాయకులు కేంద్రంలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఏకంగా భారతదేశానికే హోంమంత్రిగా చేసిన సుశీల్ కుమార్ షిండే గడిచిన కాంగ్రెస్ హయాంలో షోలాపూర్ నుంచి ఎంపీగా గెలిచి కేంద్రంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయినా అక్కడ అభివృద్ధి పారిశుధ్యం, మరుగుదొడ్లు, జీవనప్రమానం, వసతులు ఇసుమంతైనా కనిపించవు. అందుకే కాబోలు ఈ 2014 ఎన్నికల్లో సుశీల్ కుమార్ షిండే ను అనామిక మరాఠీ సినిమా ఆర్టిస్ట్ చేతుల్లో షోలాపూర్ జనం 2 లక్షలకు పైచిలుకు ఓట్లతో చిత్తుచిత్తుగా ఓడించారు. అధికారం, అంగ, ఆర్థిక బలం ఉన్న సుశీల్ కుమార్ షిండే షోలాపూర్ ను ఎంతో అభివృద్ధి చేశారనుకుంటాం కానీ అక్కడ దిగాక కానీ అది ఎంతో దుర్భర సిటీ చెప్పడానికి మాటలు రాలేందంటే నమ్మండి..  వేలమంది ఏపీ, తెలంగాణల నుంచి పొట్ట చేతపట్టుకుని మహారాష్ట్రలోని పారిశ్రామిక ప్రాంతం షోలాపూర్ కు వెళ్లారు. మరి అక్కడున్న తెలుగువాళ్లు సంతోషంగా ఉన్నారా.? వారి జీవన స్థితిగతులు లేంటి.? దీనిపై పొలిటికల్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోకస్..

సైకిల్ పై సవారీనే..

solapoor-02
ఉదయం 7 కావస్తుంది. మేడపైనుంచి కిందకు చూస్తే సైకిల్ పై వరుసగా పోతున్న వారు కనపడతారు.. ఎందుకిలా పోతున్నారో కనుక్కుంటే మనం నమ్మలేని సత్యం బోధపడుతుంది. అసలు విషయం ఏంటంటే అక్కడ పరిశ్రమల్లో కార్మికులు, కూలీ నాలీ చేసుకునే వారు.. ఒక ఉద్యోగులు తప్ప అందరూ సైకిల్ నే వాడతారు. చిత్రంగా ఉన్న ఇది నిజం.. ప్రభుత్వ ఉద్యోగులు.. కొంచెం డబ్బున్న వాళ్లు తప్ప అందరూ సైకిల్ పైనే తమ అవసరాలను తీర్చుకుంటారు. పనికి , నిత్యావసరాలకు, పనికి వెళ్లేందుకు సైకిల్ వాడడంతో షోలాపూర్ లో ఉదయం 9 గంటల వరకు రోడ్లపైనే సైకిల్ సవారీలే కనపడతాయి.. కొత్త గా వెళ్లేవారు అక్కడ సైకిల్ పోటీలు పెట్టారేమోనన్న సందేహం కలగకమానదు..

కార్మికుల బతుకులు చాకిరీనే.. వారి పిల్లలు నిరక్ష్యరాస్యులు
ఉదయాన్నే జాతరలా కార్మికుల సైకిల్ మీద తమ తమ పనులకు వెళుతుంటారు. అక్కడ ప్రభుత్వ ఉద్యోుగులు.. పెద్ద పెద్ద ప్రైవేట్ ఉద్యోగులు మాత్రమే ద్విచక్రవాహనాలు, కార్లు వాడుతారు. మిగతా రోజువారీ అవసరాలకు, పనులకు జనం ఎక్కువగా సైకిల్నే వాడతారు. షోలాపూర్ లో ఉన్న ఇంకా మయాదారి వ్యవస్థ ఏంటంటే తల్లిదండ్రులు పనికి వెళితే వారి పిల్లలు పనిపట్లే ఆసక్తి చూపిస్తున్నారు. 90 శాతం మంది చదువులు 10వరకే పూర్తి చేసి పనులకు తల్లిదండ్రుల వెంట వెళుతున్న దృశ్యం కనిపించింది. మనలాగా ఎంబీఏ, బీటెక్ లు, ఎంసీఏలు చేసే వారు షోలాపూర్ లో చాలా తక్కువ. ఎక్కువగా స్వయం ఉపాధి, శాంచలు, వ్యాపారాలు నిర్వహించడానికే అక్కడి యువత ఆసక్తి చూపిస్తోంది.

మన పోలీసులే బెటర్..
మహారాష్ట్రలోని షోలాపూర్ సిటీలో రోజంతా తిరిగిన అక్కడ రోడ్లమీద ఒక్క పోలీస్ అయిన కనిపించలేదు. కనీసం ట్రాఫిక్ పోలీసులకు దిక్కులేదు.. నగరంలో గల్లీల్లో టేలా డబ్బాల వద్ద మట్కా, జూదం విచ్చలవిడిగా సాగుతోంది. 1 నుంచి 100 వరకు నంబర్ల మట్కాలో విక్రయిస్తారు. రూ.10 పెట్టి కొంటే గెలిస్తే  900 చెల్లిస్తారు. ఈ మట్కా వ్యాపారాల వెనుక అక్కడ పెద్ద నెట్ వర్క్ ఉందట.. నెలనెలా స్థానిక ఎస్ఐ. సీఐలకు పెద్ద ఎత్తున మామూళ్లు ముట్ట చెబుతారట..  షోలాపూర్ లో రాత్రుళ్లు వాహనాలు, వస్తువులు బయటపెట్టరు. అక్కడ దొంగల భయం చాలా ఎక్కువ. రోడ్లపై నడుస్తున్న మహిళల మెడలోంచి చైన్లు అక్కడ రోజు చోరీకి గురవుతాయి. పోలీసులు కనీసం పట్టుకోరు. రికవరీ చేయరు.. రికవరీ చేసిన వారి ఉంచుకుంటారు తప్పితే బాధితులకు ఇవ్వరంట.. ఇలా షోలాపూర్ సిటీలో పోలీస్ వ్యవస్థ అధ్వాన్నం. అందుకే  మన పోలీసులే కొంత బెటర్ అనిపించింది.

రేకులతో ఇండ్లు, రోడ్ల మీద ఎక్కడికక్కడ చెత్తాచెదారం..

solapoor-01 solapoor-03
షోలాపూర్ సిటీ రోడ్ల మీదకు వెళితే ఎక్కడ చూసినా చెత్త మనకు దర్శనమిస్తుంది. అక్కడ ఎక్కువగా ఇండ్లు స్టీల్ రేకులతో కట్టుకుంటారు. అవి కూడా మన బాత్రూం అంత చిన్నవిగా ఉంటాయి. ఎక్కడ చూసిన స్లమ్ ఏరియాలే షోలాపూర్ లో దర్శనమిచ్చాయి. కట్టుకున్న ఇండ్లు కూడా చాలా ఇరుకుగా రెండు రూములున్న ఇండ్లే కనిపించాయి. రేకులతో కట్టుకున్న ఇండ్లలో జనం అవస్థలు అక్కడున్న పాలకులకు కనిపించలేదంటే అతిశయోక్తి కాదు.

కంపుకొడుతున్న కాలనీలు..

solapoor-04
షోలాపూర్ సిటీలో అసలు పారిశుధ్య వ్యవస్థ ఉందా అన్న సందేహం కలగక మానదు. అక్కడున్న కుటుంబాల్లో భర్తలు పరిశ్రమల్లో , చేనేత వృత్తుల్లో పనులకు వెళితే భార్యలు ఎక్కువగా బీడీలు చుడతారు.. బీడీ వ్యర్థ పదార్థాలను రోడ్లమీదే వేస్తారు. అక్కడు చెత్త కుండీలు..కార్పొరేషన్ చెత్త సేకరించే ట్రాక్టర్ లు ఉండవు. రిక్షాల్లో కార్మికులు వారానికి ఒకసారి వచ్చి చెత్త తీస్తారట.. మిగితా 5 రోజుల్లో రోడ్ల పరిసరాలు కంపు కంపే..

ఇక అక్కడున్న మరో దురలవాటు.. ఇండ్లలో మరుగుదొడ్లు లేకపోవడం.. కార్పొరేషన్ వీధికి ఒకటంటూ సామూహిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటలనుంచి మహిళలు ముంతలు పట్టుకొని వాటి వద్దకు వెళ్లడం కనిపిస్తుంది. అభివృద్ధి అభివృద్ధి అంటూ జబ్బలు చరుచుకుంటున్న పాలకులు.. మహిళల ఈ బాధలు ఎందుకు అర్థం కావో ఆశ్ఛర్యం వేసింది. ఇక అక్కడ జనంకు వారంలో ఒకరోజు మాత్రమే కార్పొరేషన్ మంచి నీటి సరఫరా చేస్తుంది. ఆ రోజు పండుగలున్నా.. పబ్బాలున్నా జనం ఇంటి వద్దే ఉంటూ నీళ్లు పట్టుకుంటారంటే జనం పడుతున్న బాధలు అర్థం చేసుకోవచ్చు..

మొత్తంగా మహారాష్ట్రలో షోలాపూర్ చూస్తే పైన పటారం.. లోన లొటారం ఉంది పరిస్థితి. పైకి అభివృద్ధి అంటూ కార్మికుల పొట్ట కొడుతున్నారు. అపరిశుభ్ర, పారిశుధ్య లేమి జనాన్ని రోగాల పాల్జేస్తోంది. పరిశ్రమలు ఉన్న అక్కడ తెలుగొళ్ల జీవితాల్లో వెలుగులు లేవు. పిల్లలు అక్షరాస్యత కు నోచుకోలేదు. దోచుకుపోతున్న నిద్రపోతున్న పోలీస్ వ్యవస్థ.. ఆరురోజులకోసారి వచ్చే మంచినీరు ఇలా షోలాపూర్ దుస్థితి రాస్తే వొడిసేది కాదు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.