
ముంబై, ప్రతినిధి : రాజస్తాన్ పాలిటిక్స్ లో జరిగిన అంతరంగాల్ని, ఎపైర్ లను ఆవిష్కరించేలా రూపొందించిన హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘డర్టీ పాలిటిక్స్’ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచార చిత్రానికి నెటిజన్ల నుంచి మాంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా గురించి హీరోయిన్ మల్లికా ఓ విషయం బయటపెట్టింది. నటుడు ఓంపురితో కలిసి కొన్ని హాట్ సన్నివేశాల్లో నటించడానికి చాలా ఇబ్బందిపడ్డానని తెలిపింది. ఐతే, బోల్డ్ సీన్స్ చేయడానికి తనకు ఏమాత్రం సౌకర్యంగా లేదని, ఆ నటుడు తనను కన్విన్స్ చేశారని చెప్పుకొచ్చింది.
ఈ కథ ప్రధానంగా అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన రాజస్థాన్‌లో నర్స్ భన్వరిదేవిపై అత్యాచారం, హత్య నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కె.సి.బొకాడియా డైరెక్ట్ చేస్తున్న ఇందులో రాజకీయ నాయకుడిగా ఓంపురి కనిపిస్తున్నాడు. ఇంకా నసీరుద్దీన్‌షా, అనుపమ్‌ఖేర్, జాకీష్రాఫ్, అశుతోష్ రాణా, రాజ్‌పాల్ యాదవ్ వంటి నటులు ముఖ్యమైన రోల్స్ చేస్తున్నారు. ట్రైలర్లో కాస్త హాట్ సీన్స్ దర్శనమీయడంతో, సినిమాలో ఇంకా ఏ రేంజ్లో వుంటుందోనంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.