షీటీంలు భద్రత పట్ల భరోసాను కల్పిస్తున్నాయి

షీటీంలు భద్రత పట్ల భరోసాను కల్పిస్తున్నాయి

మహిళలు, విద్యార్ధినులు పట్ల షీటీంలు భద్రతపై భరోసాను కల్పిస్తున్నాయని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి అన్నారు. షీటీంల పనితీరుపై మహిళలు, విద్యార్ధినులకు నమ్మకం ఏర్పడిందని చెప్పారు. శనివారం కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో షీటీంలకు పట్టుబడిన ఏడుగురు యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ వి.బి.. కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ షీటీం సభ్యులు నగరంలోని ముఖ్య కూడళ్లలో మాటువేసి ఉండి మహిళలు, విద్యార్ధినులు వేధిస్తున్న వారిని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆధారాలను సేకరిస్తూ పట్టుకుంటున్నారని తెలిపారు. మొదటి విడత పట్టుబడిన వారిని కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వదిలి పెడుతున్నామని చెప్పారు. రెండవ విడత పట్టుబడితే కేసులు నమోదు చేయడంతోపాటు రౌడీషీట్లను తెరుస్తున్నామని ప్రకటించారు. షీటీంల పనితీరును వివరిస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కమీషనరేట్ పరిధిలో 14 షీటీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 84 మందిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. హక్ ఐ అప్లికేషన్ ను ఇప్పటివరకు ఐదువేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లకు రాకుండా నేరాలతో పాటు ఇతర విషయాలను ఫిర్యాదు చేసే అవకాశం హక్ ఐ ద్వారా ఉందని చెప్పారు.

27న సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలి

సేఫ్ అండ్ స్మార్ట్ కరీంనగర్ లో భాగంగా ఈనెల 27న సైక్లోధానన్ పేరిట నిర్వహించ తలపెట్టిన సైకిల్ ర్యాలీలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి కోరారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియం నుండి ఎస్ఆర్ఆర్ కళాశాల వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. శనివారం నాడు కమీషనరేట్ కేంద్రంలోని దివంగత ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హల్లో విలేకర్లతో సమావేవం జరిగింది. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ సుహృధ్భావ వాతావరణంతో పాటు కాలుష్య నివారణకు దోహదపడాలనే ఉద్దేశ్యంతో ర్యాలీని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కమీషనరేట్ ఆధ్వర్యంలో వివిధ వర్గాల భాగస్వామ్యంతో నెలకో కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. ర్యాలీ ప్రారంభం కానున్న అంబేద్కర్ స్టేడియం మైదానాన్ని కమీషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శశాంక, కరీంనగర్ ఎసిపి జె. రామారావు, వన్ టౌన్ ఇన్స్ పెక్టర్ తుల శ్రీనివాసరావు, ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు జనార్ధన్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఐసోటీం వ్యవస్ధాపకులు ఘన్ శ్యామ్ ఓజ్లా తదితరులు పరిశీలించారు.

v.b kamalasan reddy.     v.b. kamalasan reddy..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *