
-1000 చిత్రాల మైలురాయి దాటిని ఇళయరాజాకు సన్మానం
ముంబై, ప్రతినిధి : భారత దేశం గర్వించదగ్గ ముగ్గురు దిగ్గజ నటులు అమితాబ్, రజనీకాంత్, కమల్ హాసన్ లు ఒకే వేదికపై కనిపించి అభిమానులకు కనుల విందును పంచారు. ముంబై ‘షమితాబ్’ పాటల వేడుక సందర్భంగా ఈ అద్భుతం చోటుచేసుకుంది. షమితాబ్ కు మ్యూజిక్ అందించిన మ్యాస్ట్రో ఇళయరాజాను 1000 చిత్రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ మగ్గురు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ తాను శిక్షణ తీసుకొని నటున్ని కాలేదని.. అనుకోకుండా నటున్ని అయ్యానన్నారు. ఇళయారాజా పాటలు లేకపోయింటే ఇంతదూరం వచ్చేవాన్ని కాదు.. నా ప్రతిరోజు మీ పాటలతోనే గడుస్తుంది .. ఇళయరాజాకు నా ధన్యవాదాలు .. మీరు సంగీత ప్రపంచానికి దేవుడు అని అమితాబ్ ఇళయారాజాను పొగడ్తలతో ముంచెత్తారు.
ఈ కార్యక్రమంలో షమితాబ్ యూనిట్ సభ్యులు , నటి శ్రీదేవి, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, ధనుష్, ఆర్. బాల్కి, అక్షర హాసన్, టబు, శృతి హాసన్ పాల్గొన్నారు.