
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీ సీతారాముల
కళ్యాణమహోత్సవం అంగరంగావైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని
ఏర్పాట్లను చేస్తోంది. ఏప్రిల్ 5న జరిగే శ్రీ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక ,
వాల్ పోస్టర్ ను మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు అసెంబ్లీ కమిటీ హాల్ లో
ఇవాళ ఆవిష్కరించారు . కళ్యాణ మహోత్సవ మిథిలా ప్రాంగణంలో భక్తులు స్వామివారి కల్యాణ
మహోత్సవాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని
చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు తెలిపారు .
ప్రతి యేటా అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి అన్ని
ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , తుమ్మల నాగేశ్వర్ రావు
వెల్లడించారు . కళ్యాణ శోభ ఉట్టిపడేలా మండపాన్ని అధికారులు తీర్చిదిదద్దుతున్నారన్నారు.
ఏప్రిల్ 5న జరిగే శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవానికి అందరూ అహ్వానితులే అని మంత్రులు
అహ్వానం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జలగం వెంకట్ రావు,సున్నం రాజయ్య, మదన్ లాల్,పాయం
వెంకటర్శ్వర్లు , తాటి వెంకటేశ్వర్లు ,భాస్కర్ రావు తో పాటు భద్రచలం ఈవో రమేష్
పాల్గోన్నారు.