శ్రీ శ్రీ శ్రీ స్వామీ సత్యపథానంద ప్రభుజీ నిర్యాణం..

IMG-20150723-WA0014-(1)

జూలై23:కీసరలోని సాయిధామం వ్యవస్థాపకులు .. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ స్వామీ సత్యపథానంద ప్రభుజీ గురుదేవులు ఈరోజు ఉదయం 5 గంటలకు దేహం వీడారు . మూడు దశాబ్దాలుగా సాయిధామం ఆశ్రమంలో ధార్మిక , ఆధ్యాత్మిక , సేవాకార్యక్రమాలను స్వామీజీ నిర్వహిస్తున్నారు . ఆశ్రమంలో విద్యాలయాన్ని , వృద్ధాశ్రమాన్ని , వృత్తి శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తూ ధార్మిక – సామాజిక సేవతో ఎందరికో మార్గదర్శులయ్యారు . సనాతన ధర్మం , దేశభక్తి ని యువతలో అలవర్చటం కోసం అహరహం ఆయన కృషి చేసారు .. అటు ఆధ్యాత్మిక .. ఇటు సామాజిక సేవలను ఆహ్లాదకర వాతావరణం గల ఆశ్రమంలో నిర్వహిస్తూ స్వామీజీ సాయిధామాన్ని గొప్ప క్షేత్రంగా .. సాధనా కేంద్రం గా , తపోభూమిగా మలచారు. స్వామీ సత్యపథానంద ప్రభుజీ నిర్యాణం ఆధ్యాత్మిక లోకానికి తీరని లోటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని “దర్శనమ్ ” భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అక్షరాంజలి ఘటించారు. ఆయన మృతి పట్ల ఆర్ఎస్ఎస్ కార్యనిర్వహక కార్యదర్శి భాగయ్య , వరిష్ఠ పాత్రికేయులు ఎం వీ ఆర్ శాస్త్రి ఇంకా పలువురు ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటించారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *