Breaking News

శ్రీవారి దీవెనలతో  కాళేశ్వర ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలి: మంత్రి హరీష్ రావు

శ్రీవారి దీవెనలతో  కాళేశ్వర ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలి: మంత్రి హరీష్ రావు

తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి….

తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారం తో ముందుకెళ్లాలి…

సీఎం కేసీఆర్ తిరుమల కు సమానంగా  యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు….

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు

తిరుమల శ్రీవారిని  మంత్రి హరీష్ రావు ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలన్నారు. సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారని హరీశ్ రావు తెలిపారు. ఉభయ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న మంత్రికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాలాజి స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు.

harish rao 1     harish rao 2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *