
తిరుమల , ప్రతినిధి : ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకొని స్వామి వారి సేవలో పాలుపంచుకున్నారు. అంతకుముందు తిరుమల తిరుపతి జేఈవో కేఎస్ శ్రీనివాస రాజు ఆలయం ఎదుట డిప్యూటీ సీఎంకు సాదర స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం కృష్ణమూర్తికి ఆలయ అర్చకులు వేదవచనం కావించి , స్వామి వారి ప్రసాదం అందజేసి, శేష వస్త్రం కప్పి తిరుమల రంగనాయకుల మండపంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటయ్య, దామోదరం , ఇతర అధికారులు పాల్గొన్నారు.