Breaking News

శ్రీవారికి చేయిస్తము బంగారు పగడాలు

srivaru

దేవుడి మొక్కలకు రూ.5 కోట్లు
హైదరాబాద్, ప్రతినిధి : దేశంలోని ఏ కేబినెట్ తీసుకోని నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తీసుకుంది. అదే దేవుడికి మొక్కు చెల్లింపు. అదీ ప్రభుత్వ ఖాజానా నుంచి చేయడం ఇదే మొదటిసారి.. ఇవన్నీ అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం ఆయా దేవుళ్లకు సమర్పిస్తారు. దీనికి తెలంగాణ మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

శుక్రవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కేసీఆర్ మంత్రివర్గ నిర్ణయాలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ గతంలో ఎక్కడని కొండ లేదని.. మొక్కని దేవుడు లేడని కేసీఆర్ అన్నారు. అనేక మొక్కులు మొక్కామని.. ఇఫ్పుడు తీర్చే సమయం వచ్చిందని తెలిపారు.

తెలంగాణ వస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.5 కోట్లతో ఆభరణాలు చేయిస్తామని చెప్పారు. వాటిని తానే వెళ్లి శ్రీవారికి సమర్పిస్తానని కేసీఆర్ చెప్పారు. అలాగే అజ్మీర్ దర్గా లో తెలంగాణ యాత్రికులకు వసతి కల్పించేందుకు రూ.5 కోట్లతో వసతి గృహం నిర్మిస్తామని పేర్కొన్నారు. దాంతో పాటు వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం.. కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు.. విజయవాడ కనకదుర్గమ్మకు , తిరుపతి పద్మావతి అమ్మవారికి ముకు్కపుడకలను అధికారికంగా సమర్పిస్తామని కేసీఆర్ తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *