
కొలోంబో, ప్రతినిధి : శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా సిరసేనా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో రాజపక్సేపై మైత్రిపాల సిరిసేనా భారీ మెజారిటీతో గెలిచారు.
పదేళ్ల రాజపక్సే పాలనకు ఎండ్ కార్డు పడింది. శ్రీలంకకు మైత్రిపాల సిరిసేనా ఆరో ప్రెసిడెంట్. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే రాజపక్సే వేసిన ప్లాన్లు ఏవీ సక్సెస్ కాలేదు. రాజపక్సేను గెలిపించాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఎన్నికల ప్రచారంలో పార్టిసిపేట్ చేశాడు.