
సిడ్నీ : ప్రపంచకప్ లో శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 64 పరుగులతో గెలుపొందింది. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ లో శ్రీలంక అసీస్ కు గట్టిపోటీనిచ్చింది. గ్రూప్ ఏ నుంచి న్యూజిలాండ్ ఇదివరకే క్వార్టర్ కు చేరగా రెండో జట్టుగా అసీస్ చేరింది.
మొదట ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ దుమ్మురేపడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 376 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అసీస్ కు మాక్స్ వెల్ మెరుపు సెంచరీతో భారీ స్కోరు సాధ్యమైంది. మాక్స్ వెల్ 53 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వాట్సాన్ 67పరుగులు, స్మిత్ 72, క్లార్క్ 68 పరుగులు చేశారు. దీంతో అసీస్ 376 పరుగులు చేసింద.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 46.2 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక తుదివరకు విజయం కోసం పోరాడిన వికెట్లు వెంటవెంటనే కోల్పోవడంతో ఓటమి తప్పలేదు. సంగక్కర సెంచరీ, దిల్షన్ 62 పరుగులు , చాందిమాల్ 52 పరుగులు, మ్యాథ్యూస్ 35 పరుగులు చేశారు. చివరకు వికెట్లు కోల్పోవడంతో శ్రీలంక ఓడిపోయింది.