శ్రీరాంసాగర్ , నాగార్జునసాగర్, నిజాంసాగర్ రబీ ఆయకట్టు పై మంత్రి హరీష్ రావు సమీక్ష

IMG-20180215-WA0024

 

#శ్రీరాంసాగర్ , నాగార్జునసాగర్, నిజాంసాగర్ రబీ ఆయకట్టు పై మంత్రి హరీష్ రావు సమీక్ష:

#13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలి.

# ప్రాజెక్టుల కింద మొత్తం 19 లక్షల ఎకరాలకు రబిలో సాగునీరు.

#పకడ్బందీగా నీటి నిర్వహణ.

#చివరి భూములకు నీరు అందించాలి.

#మిషన్ భగీరథ నీటి అవసరాలను దృష్టి లో ఉంచుకొని జలాశయాల నీటి నిల్వలను కాపాడు కోవాలి.
—————-////———–
రబీ లో శ్రీరాంసాగర్ , నాగార్జున సాగర్ , నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద నీతి నిర్వహన , సాధించిన ఆయకట్టు , మిషన్ భగీరత అవసరాలు తదితర అంశాలను సంబందిత చీఫ్ ఇంజనీర్లు , సూపరింటెండింగ్ ఇంజనీర్లతో బుధవారం నాడు జలసౌధలో మంత్రి సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీలో ఎల్‌ఎం‌డి కి ఎగువన 4 లక్ష్ల ఎకరాలకు, ఎల్‌ఎం‌డి కి దిగువన 1. 15 లక్షల ఎక్రాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రీ అన్నారు. ఈ లక్ష్యాలను సాధిస్తూనే మిషన్ భగీరత పథకానికి కేటాయించిన నీటిని జలాశయాల్లో కాపాడుకోవాలని మంత్రి ఇంజనీర్లకు సూచించినారు. శ్రీరామ్ సాగర్ జలాశ్యామ్ నుండి ఇప్పటితే 7 తడులకు నీరిచ్చామని మరో నాలుగు తడులకు నీరివ్వాల్సిన అవసరం ఉన్న్దని శ్రీరాంసాగర్ చీఫ్ ఇంజనీర్ శంకర్ మంత్రికి తెలిపినారు. ఎల్‌ఎం‌డి కి పైన ఉన్న 4 లక్షల ఎకరాలకు చివరి భూములకు కూడా నీరు అందించేందుకు పకడ్బందీగా చర్యలు తెసుకుంటున్నామని ఆయన తెలిపినారు. ఎల్‌ఎం‌డి కి ఎగువన కాలువపై 31 85 పంపులు నడుస్తున్నాయని మంత్రికి తెలిపినారు. అట్లాగే శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువులను కూడా నింపుతున్నామని శంకర్ తెలిపినారు. కాలువలపై రాత్రి వేళల్లో కూడా గస్తీ నిర్వహించాలని , అక్రమంగా తూములు న, కాలువలు పగులకొట్టకుండా , గెట్లను ఎత్తివేయకుండా చూడాలని ఆవసరమైతే పోలీసు , రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని మంత్రి ఇంజనీర్లకు సూచించినారు. ఆయకట్టు పరిధిలో ఉన్న చెరువుల కింద ఆయకట్టుని, పంపుల ద్వారా సాగు చేసుకుంటున్న ఆయకట్టుని కూడా లెక్కగట్టాలని , రెవెన్యూ వారితో కలిసి చేసే జాయింట్ అజమాయిష్ లో కూడా నమోదు చేయాలని ఆదేశించినారు. ఇప్పుడు శ్రీరాంసాగర్ జలాశయంలో 10 టి‌ఎం‌సి ల నీరు ఉందని. మరో నాలుగు తడులకు 4 టి‌ఎం‌సి ల నీరు అవసరమని మిగతా 6 టి‌ఎం‌సి నీటిని మిషన్ భగీరత అవసరాలను వినియోగిద్తామని చీఫ్ ఇంజనీర్ మంత్రికి తెలిపినారు. ఏప్రిల్ 16 కు ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ మూసివేయాలని , 20 మార్చ్ కు ఎల్‌ఎం‌డి కాలువ మూసివేయాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించినారు. శ్రీరాంసాగర్ జలాశయామ్ నుండి నీటిని పంపు చేసే ముందు తప్పని సరిగా చీఫ్ ఇంజనీర్ అనుమతి తీసుకోవాలని ఐ‌డి‌సి ఇంజనీర్లను మంత్రి ఆదేశించినారు.
నాగార్జునసాగర్ కింద రబిలో 5 లక్ష్ల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి అన్నారు. పాలేరు కు ఎగువన 3 లక్షల ఎకరాలు , పాలేరు దిగువన 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని కోరారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 32 టి‌ఎం‌సి , నాగార్జున సాగర్ జలాశయంలో 30 టి‌ఎం‌సి లు మొత్తం 72 టి‌ఎం‌సి ల నీటి లభ్యత ఉందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపినారు.ఇప్పటివరకు శ్రీశైల , నాగార్జునసాగర్ కాంప్లెక్స్ నుంచి మొత్తం 126 టి‌ఎం‌సి లు వినియోగించుకున్నామని , ఆంధ్రప్రదేశ్ 299 టి‌ఎం‌సి లు వినియోగించుకున్నాడని ఈ‌ఎన్‌సి మురళీధర్ తెలిపినారు. ఇప్పటివరకు రబీ పంటకు 7 తదుల నీటిని విడుదల చేశామని , మరో నాలుగు తడులకు నీరివ్వాల్సిన అవసరం ఉన్నదని ఆయన మంత్రికి తెలిపినారు. అందుకు మరో 16 టి‌ఎం‌సి లను వినియోగిస్తామని అన్నారు. మిషన్ భగీరాతకి అవసరమయ్యే 12 టి‌ఎం‌సి ల నీటిని కాపాడుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. 5 ఏప్రిల్ కి నాగార్జున ఎడమ కాలువ తూము మూసి వేయాలని మంత్రి సూచించినారు. పాలేరు కింద పాతకాలువ , భక్త రామదాసు ఆయకట్టుని కూడా జాయింట్ అజమాయిష్ లో లెక్కించాలని మంత్రి సూచించినారు. పులిచింతల పునరావాస పనులను జూన్ 2018 లోగా పూర్ట్ చేయాలని సూర్యాపేట జాయింట్ వ్కలెక్టరుకు పి‌హెచ్‌ఎన్ లో ఆదేశించినారు. వారం వారం సమీక్షా సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించినారు.
నిజాంసాగర్ కింద రబిలో 2 లక్షల ఎకరాల లక్ష్యాన్ని సాధించాలని అదికారులకు ఆదేశించినారు. గత సంవత్సరం కూడా రబీ లో అధ్భుత ఫలితాలు సాధించామని , ఈ ఏడు కూడా అటువంటి ఫలితాలు సాధించాలని మంత్రి ఆదేశించినారు. గతం రబీ లో 2 లక్షల ఎకరాల లక్ష్యాన్ని సాధించిన సందర్భాలు లేవని మంత్రి అన్నారు. ఖరీఫ్ లో 1.12 లక్షల ఏకరాకు సాగు నీరు అందించి పంటలను కాపాడినట్టు మంత్రి తెలిపినారు.
రబీ లో రాష్ట్రం లో శ్రీరాంసాగర్ కింద 6 ల్శక్షలు , నాగార్జునసాగర్ కింద 5 లక్షలు, నిజాంసాగర్ కింద 2 లక్షలు, మీడియం పాజెక్టులకింద 6 లక్షల ఎకరాలకు మొత్తం 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపినారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *