
ప్రతిష్టాత్మకమైన శ్రీరంగం ఆలయంలో నేల మాళిగలు వెలుగుచూశాయి. ఆలయ పునరుద్ధరణ పనులు చేస్తుండగా మట్టిగోడ కనిపించింది. దాన్ని తవ్వి చూడగా లోపల 12 ఆడుగుల పొడవైన ద్వారా కనిపించింది. అందులో ఒక పెద్ద బండరాయి పెట్టి ఉంది. దాన్ని తొలగించగా లోపల నేల మాళిక కనిపించింది. ఆలయ సిబ్బంది అందులోకి దిగి చూశారు. కానీ ఏమీ కనిపించలేదు. దాని పక్కనే మరో 2 నేల మాళిగలు ఉన్నట్టు చెబుతున్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు ఆ నేల మాళిగలను కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు.