
శ్రీమంతుడి మహేశ్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రకాష్ రాజ్ ముందుకొచ్చాడు. ఇఫ్పటికే ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ సహాయంతో సేవా కార్యక్రమాలు చేస్తున్న విలక్షన్ నటుడు, విలన్ ప్రకాష్ రాజ్ ఇవాళ తెలంగాణ సచివాలయంలో మంత్రి కేటీఆర్ ను కలిశారు..
మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఈ విషయాన్ని కేటీఆర్, ప్రకాశ్ రాజ్ లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. వెనుకబడిన జిల్లాలోని గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రకాష్ రాజ్ ప్రకటించారు.