శ్రీమంతుడి దాతృత్వం..

శ్రీమంతుడు దాదాపు 19 లక్షల కోట్ల కంపెనీ అధిపతి.. ఫేస్ బుక్ సంస్థ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్ బర్గ్ తన కూతురు పుట్టిన వేళా విశేషంలో త న ఆస్తినంతా ధారపోశాడు.. ఒకటి రెండు కాదు దాదాపు తన కు చెందిన షేర్ లోని 99శాతం ను పిల్లలకోసం , ప్రపంచ సౌభాగ్యం కోసం ధారపోస్తున్నట్టు తెలిపాడు.

అంతేకాదు తన కూతురుకు ఎందుకు దానం చేస్తున్నానో.. లేఖ రాశాడు.. ఈ ప్రపంచంలోకి స్వాగతం అంటూ మొదలుపెట్టిన ఆ లేఖలో మార్క్ జుకెర్ బర్గ్ తన పుత్రికోత్సాహాన్ని చాటుకున్నారు.

మాక్స్ అని పేరు పెట్టుకున్న కూతురి కోసం ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దడాన్ని ఓ గొప్ప బాధ్యతగా భావిస్తున్నాం అని జుకెర్ ప్రకటించారు.  రేపటి తరంలోని చిన్నారులందరి మధ్య సమానత్వాన్ని ప్రొత్సహించేందుకు, మానవసామర్థ్యాన్ని  ముందుకు తీసుకెళ్లేందుకు  ప్రపంచవ్యాప్తంగా ప్రజలతో చేతులు కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని 3 లక్షల కోట్లతో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *