శ్రీపాదరావు విగ్రహం ధ్వంసం, కాంగ్రెస్ ఆందోళన బాట

కరీంనగర్ : కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. కరీంనగర్ జిల్లాపై మాజీ మంత్రి శ్రీధర్ బాబుది ఏకచ్ఛత్రాధిపత్యం.. ఆయన చెప్పింది శాసనం.. ఆ సమయంలో ఆయన తండ్రి, మాజీ స్పీకర్ దుద్దిళ శ్రీపాదరావు విగ్రహాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం పోయి టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ నాయకులపై రివేంజ్ స్టార్ట్ అయ్యింది.

మంథని నియోజకవర్గంలో ప్రతీ మండలంలో శ్రీపాద విగ్రహాలను ఏర్పాటు చేశారు.  ఇప్పుడు కాటారంలో శ్రీపాద విగ్రహాన్ని నిన్న కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆయన తల భాగాన్ని దుండగులు కూల్చి తీసుకెళ్లిపోయారు. దీనిపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. మాజీ మంత్రి శ్రీదర్ బాబు కాటారంలో సందర్శించి విగ్రహాన్ని పరిశీలించారు. దీనికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర జిల్లా వ్యాప్తంగా శుక్రవారం కాంగ్రెస్ శ్రేణులు ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. మొత్తానికి శ్రీపాద విగ్రహ ధ్వంసం కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్య వివాదానికి కారణమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *