
‘నాన్న’ చిత్రంలో ఆత్మీయ నటనను ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్న సారా గుర్తుందిగా?.. ఆమె ప్రధాన పాత్రలో ‘నాన్న’ ఫేం ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైవం’. తమిళంలో ఆ మధ్యన విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల నుంచి కితాబు అందుకుంది. ఇందులో సారా నటన అద్భుతంగా ఉందని ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో క్రిష్ డైరక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. ‘శైవం’ తెలుగు రీమెక్ లో నటకిరీటి రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రను చేస్తున్నట్లు సమాచారం. ‘శైవం’లో నాజర్ చేసిన పాత్రను తెలుగులో రాజేంద్రప్రసాద్ చేస్తున్నారట. పస్తుతం ఠాగూర్ సినిమా హిందీ రీమేక్ ‘గబ్బర్’ లో బిజీగా వున్న డైరెక్టర్ క్రిష్..ఆ సినిమా తరువాత దీనిని మొదలుపెడతారని తెలుస్తోంది.