శునకాల పాసింగ్ ఔట్ పరేడ్ కు హాజరవ్వడం సంతోషంగా ఉంది: హోం మంత్రి

ఈ అకాడమీకి గతంలో ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసిన పదిహేనవ, ఇప్పుడు  పదహారవ పోలీస్  శునకాల పాసింగ్ ఔట్ పరేడ్ కు హాజరవ్వడం సంతోషంగా ఉందని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు.     పోలీస్ శునకాల శిక్షణ కేంద్రం ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ లో కేవలం పది శునకాల ట్రైనింగ్ తో రెండు వేల నాలుగు (2004) లో ప్రారంభం అయి, రెండువేల ఆరు (2006) లో పూర్తి స్థాయి ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ గా 78 ఎకరాల ఆవరణలో మొయినాబాద్ కి బదిలీ చేయబడిందన్నారు. వివిధ సంఘ విద్రోహ శక్తుల, టెర్రరిస్ట్ ఇతర అరాచక శక్తుల వల్ల శాంతి భద్రతలకు కలిగే ముప్పును ముందే పసిగట్టి…. వాటిని నిర్వీర్యం చేసే చర్యలలో ….. పోలీస్ శునకాల పాత్ర ప్రముఖంగా ఉందన్నారు.  వి.వి.ఐ.పీ. సెక్యూరిటీ, యాంటి సాబుటేజ్, విస్పోటక పదార్ధాల తనిఖీలు మరియు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్యూటీలలో పోలీస్ శునకాలను విరివిగా వాడుతున్నామన్నారు.       ఇప్పుడు 72 పోలీస్ శునకాలకు గత సంవత్సరం జూన్ నుండి ఇప్పటివరకు దాదాపు పదినెలలు పేలుడు పదార్ధాలు, ట్రాకింగ్, నార్కోటిక్స్, అసాల్ట్ మరియు వివిధ కోర్సు లలో ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించడం …..విధి నిర్వహణలో పోలీస్ శాఖ ముఖ్యంగా ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ యొక్క నిబద్దతకు, దీక్షకు ఒక చిన్న తార్కాణం మాత్రమె.ఇప్పటివరకు 436 పోలీస్ శునకాలకు ఈ అకాడమీ లో ట్రైనింగ్ ఇవ్వడం మామూలు విషయం కాదన్నారు.

మనుషులకు పోలీస్ ట్రైనింగ్ ఇవ్వడమే ఒక కష్టమైన పని….అట్టిది శునకాలకు పరిపూర్ణంగా ట్రైనింగ్ ఇవ్వడం చాలా క్లిష్టమైన విషయం. వీటితో పాటు….వీటిని హాండిల్ చేసే వారికి కుడా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,  ఇది కఠోర శ్రమ ….ఓపిక….దీక్ష తోనే సాధ్యమన్నారు.

ఈ ట్రైనింగ్ అకాడమీ విషయానికి వస్తే…… ఇక్కడ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లకు, డ్రైవర్ లకు కుడా వివిధ కోర్సులలో, మరియు లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం, ఉగ్రవాదం మొదలగు వాటిలో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అయితే…. ఈ అకాడమీ ని అన్ని మౌలిక వసతులతో పూర్తిస్థాయి ట్రైనింగ్ అకాడమీ గా తీర్చి దిద్దుటకు …. ఇంకా అనేక చర్యలు తీసుకోవలసి ఉందని చెప్పారు……అందుకు అవసరమైన నిధులను కేటాయించమని  ముఖ్యమంత్రి ని మాశాఖ తరపున అడుగుతామన్నారు.

గతంలో పదిహేనవ పోలీస్ శునకాల పాసింగ్ ఔట్ పరేడ్ లో ని విన్యాసాలను, నైపుణ్యాలను చూసి అప్పుడే అబ్బుర పడ్డాను. శాంతి భద్రతలు కాపాడడంలో వీటికి ప్రముఖ పాత్ర ఉంది. ఈ విషయంలో ….. డిజిపి గారికి, ఇంటలిజెన్స్ ఐజి, ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఐజి , ఇతర అధికారులకు, సిబ్బందికి అభినందనలు,  ముఖ్యమంత్రి  కేసీఆర్  కు నాయిని నర్సింహరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్యురిటి వింగ్ ఐ.జి.పి. శ్రీ ఎం.కె. సింగ్, అడిసినల్ డి.జి.పిలు.   శ్రీ అంజనీ కుమార్, శ్రీ గోపి కృష్ణ, శ్రీ పూర్ణచందర్ రావు,  కమిషనర్లు శ్రీ మహేందర్ రెడ్డి, శ్రీ సందీప్ శాండిల్య, శ్రీ మహేష్ ఎం. భగవత్ తదితరులు పాల్గొన్నవారు

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *