శిక్షణ ముగింపు

ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుళ్ళ నుండి ఎఆర్ ఎస్ఐల పదోన్నతి కోసం కరీంనగర్ లోని పోలీస్ శిక్షణ కళాశాల(పిటిసి)లో జరిగిన శిక్షణ మంగళవారం నాడు ముగిసింది. కళాశాలలో రాష్ట్ర్రంలోని 31 జిల్లాల నుండి 373 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఇంఛార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు, డిఎస్ పిలు భీంరావ్, రాంరెడ్డి, అక్ష్మినారాయణ, కళాశాల ఇండోర్, అవుట్ డోర్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పిటిసి ఇంఛార్జి ప్రిన్సిపాల్ పదవి విరమణ
కరీంనగర్ పోలీస్ శిక్షణ కళాశాల(పిటిసి) ఇంఛార్జి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు మంగళవారం నాడు పదవి విరమణ పొందారు. కళాశాలలోని ఇండోర్, అవుట్ డోర్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పదవి విరమణ పొందిన ఇంఛార్జి ప్రిన్సిపాల్ ను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ పిలు భీంరావ్, రాంరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

dsp beem rao.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *