శాస్త్ర్ర విజ్ఞానం మానవ కళ్యాణం కోసం ఉపయోగపడాలి

కరీంనగర్: శాస్త్ర్ర విజ్ఞానం మానవ కళ్యాణానికి ఉపయోగపడేలా ఉండాలని రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రువారం తిమ్మాపూర్ మండలంలోని మోడల్ స్కూల్ లో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్ధాయి ఇన్ స్త్పెర్ అవార్డ్ వైజ్ఞానిక ప్రదర్శన 2016ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సైన్స్ అంటే జీవితమని భూమి పుట్టినప్పటి నుండి సైన్స్ ఉందని అన్నారు. ఎందరో శాస్త్ర్రవేత్తలు ఎన్నో సిద్దాంతాలను కనుగొన్నారని అవి మానవ అభివృద్ధికి ఎంతో దోహద పడుతున్నాయని అన్నారు. అలెక్జండర్ కనుగొన్న పెన్సిలిన్, న్యూటన్ కనుగొన్న న్యూటన్ సిద్దాంతం, పక్షి గాలిలో ఎలా ఎగురుతుందని అదే మాదిరిగా రైట్ బ్రదర్స్ కనుగొన్న విమానం, ఆటోహల్స్ కనుగొన్న అటామిక్ ఎనర్జీ మానవాలికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. నేటి విద్యార్ధులు పిల్లలు కాదని చిచ్చర పిడుగులని, మాజీ రాష్ట్ర్రపతి అబ్దుల్ కలాం స్పూర్తితో మీ లాంటి పిల్లలే పరిసరాలను అన్వేసించి తక్కువ
ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి ఎక్కువ లాభం కలిగే కొత్త కొత్త వాటిని కనుగొనాలని సూచించారు. విజ్ఞాన ప్రదర్శనలో ఎక్కువ మంది పిల్లలు నీటి సంరక్షణ పై వాటర్ షెడ్ ప్రయోగాలు ప్రదర్శించారని అన్నారు. దీనిని బట్టి నీటి అవశ్యకత అవసరము ప్రజలకు ఎంత ఉందో అర్ధమైందని అన్నారు. మానవులు స్వార్ధ ప్రయోజనాలకు గుట్టలను చోట నీరు సంరక్షించబడి ఆరు నెలల వరకు అందిస్తుందని తద్వారా చుట్టు పక్కల భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. శాస్త్ర్ర విజ్ఞానం సరియైన పద్దతిలో వినియోగించుట సమాజిక శాస్త్ర్రవేత్తల పై ఆధారపడి ఉందని అన్నారు. శాస్త్ర్ర విజ్ఞానం వినియోగం రాజకీయ నాయకుల పై ఆధారపడి ఉంటుందని అన్నారు. శాస్త్ర్ర విజ్ఞానం వ్యాపారం కాకూడదని గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేదిగా ఉండాలని సూచించారు. శాస్త్ర్ర విజ్ఞానం మనిషి అభివృద్దే కేంద్ర బిందువుగా ఉండాలని అన్నారు. శాస్త్ర్ర విజ్ఞానం మానవ జీవితాని అనుసంధానం కావాలని సూచించారు. ప్రభుత్వాలు శాస్త్ర్ర విజ్ఞానం పై ప్రయోగాల పై ఖర్చు చేయాలని, కొత్త అన్వేషణలు జరపాలని అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుదని అన్నారు. శాస్త్ర్ర విజ్ఞానానికి ప్రయోగాలకు చదువు ముఖ్యం కాదని సరియైన విజ్ఞానం ఉంటే చాలని అందుకు బిల్ గెట్స్స్ చరిత్ర ఉదాహరణ అని తెలిపారు. విద్యార్ధులకు మార్కులు ముఖ్యం కాదని సరియైన విజ్ఞానం కావాలని అన్నారు. రాష్ట్ర్ర సాంస్కృతిక సారధి రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, విద్యార్ధులు నిత్యం కొత్త కొత్తవి కనుగొనుటకు అన్వేషణలో ఉండాలని అన్నారు. నూతన పరిశోధనలతోటే దేశం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. విద్యార్ధులు భవిష్యత్తు తరాలకు ఆస్తులని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు గొప్ప అన్వేషణ శక్తి ఉందని సన్నబియ్యం భోజనం అని కొనియాడారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లబ్ధి చేకూరే కొత్త ప్రయోగాలు చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల ఒక విజ్ఞాన కేంద్రంగా మారాలని అన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ మాట్లాడుతూ, విద్యార్ధులలో అంతర్గతంగా దాగియున్న నైపుణ్యత బయటికి తీయుటకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో దోహద పడతాయని అన్నారు. విద్యార్ధులు ఎప్పుడు కొత్త విషయాల పై అన్వేషణ కొనసాగించాలని సూచించారు. రాబోవు రోజుల్లో దేశం అభివృద్ధి చెందాలంటే కొత్త ప్రయోగాలు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్ధులు సైన్స్ లో, లెక్కలలో జ్ఞానం, అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్ధులు శాస్త్ర్రీయ విజ్ఞాన దృక్పదం అలవర్చుకోవాలని సూచించారు. జిల్లా స్ధాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ స్ధానాలలో నిలిచిన విద్యార్ధులు వారి ప్రయోగాలు రాష్ట్ర్ర, జాతీయ స్ధాయిలో అవార్డులు గెలుచుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్ధులను అభినందించారు. జిల్లా విద్యాధికారి శ్రీనివాసచారి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వ ఇన్సస్త్పెర్ అవార్డు వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లల్లో శాస్త్ర్రీ దృక్పదం పెంపొందించుటకు ఉపయోగపడుతుందని
అన్నారు. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి ఈ వైజ్ఞానిక ప్రదర్శన ఇక్కడ నిర్వహిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ నుండి 187 మంది విద్యార్ధులు, నిజామాబాద్ నుండి 139 మంది విద్యార్ధులు ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో వారు తయారు చేసిన ప్రయోగాలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. వీరినుండి 16 మందిని రాష్ట్ర్ర స్ధాయి వైజ్ఞానిక ప్రదర్శనలకు ఎంపిక చేసి పంపుతామని ఆయన తెలిపారు.

eatela     kalostavam     pooja     prarambostvam     dance     students     tula-uma

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *